సినీనటి ఛార్మీ నిన్న డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హైదారాబాద్ నాంపల్లి తెలంగాణ అబ్కారి ఆఫీసుకి ఉదయం 10 గంటల ప్రాంతంలో చేరుకున్నారు.ఆమె కోరిక మేరకు నలుగురు మహిళా ఆఫీసర్లు శ్రీలతలు, అనిత, జయలక్ష్మి మరియు రేణుకలు విచారించినట్లు సమాచారం.
అయితే ఛార్మీ నుంచి సరైన సమాచారం రాబట్టుకోవడంలో మాత్రం వీరు విఫలమయినట్లు తెలుస్తోంది.అకున్ సబర్వాల్ లేని లోటు నిన్నటి విచారణలో స్పష్టంగా కనిపించిందట.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మీ జ్యోతిలక్ష్మి అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో ఛార్మీ డ్రగ్ డీలర్ కెల్విన్ తో దిగిన ఫోటో ఒకటి అధికారులు చేజిక్కించుకున్నారు.
ఆ ఫోటో ఎక్కడిది ? కెల్విన్ తో ఫోటో ఎందుకు దిగాల్సివచ్చింది ? ఆ సినిమా ఆడియో ఫంక్షన్ పూర్తయిన తరువాత పార్టీ చేసుకొని డ్రగ్స్ తీసుకున్నారా ? ఇలాంటి ప్రశ్నలకి ఛార్మీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదట.అలాగే కెల్విన్ – ఛార్మీకి మధ్య వాట్సాప్ లో వెయ్యికి పైగా మెసేజ్లు ఉన్నాయి.
ఈ మెసేజ్లు ఎక్కడివి అని అడిగితె ఛార్మీ మౌనంగా కూర్చుందట.
ఇక పూరి జగన్నాథ్ కి ఛార్మీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.
పూరి డ్రగ్స్ వాడటమే కాదు, సరఫరా కూడా చేస్తారట, ఆయన డ్రగ్స్ వాడుతున్నప్పుడు ఎప్పుడైనా చూసారా ? పూరితో ఉన్న సంబంధం ఏమిటి ? ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఛార్మీ అధికారుల మీదకి ఎదురుతిరిగింది అని తెలుస్తోంది.అవన్నీ వ్యక్తిగత విషయాలు, మీరు ఎందుకు అడగాలి, నేనెందుకు చెప్పాలి అంటూ మొండికేసిందట ఛార్మీ.
తనకు డ్రగ్స్ అలవాటు లేదు, డ్రగ్స్ అంటే నచ్చవు, ఎవరికీ సరఫరా చేయాలేదు, ఎప్పుడు కొనలేదు.అధికారులు ఎలాంటి ప్రశ్న వేసినా ఛార్మీ నుంచి వచ్చిన సమాధానాలు ఇవ్వేనట.
కెల్విన్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఛార్మీ ఏమి చెప్పలేక మౌనంగా ఉండిపోయింది.ఇక బ్లడ్ శాంపిల్స్, గోర్లు, వెంట్రుకలు ఇవ్వడానికి ఛార్మీ నిరాకరించిన విషయం విదితమే.
అధికారులు ఆమె నుంచి ఫోరెన్సిక్ సమాచారం తీసుకోలేదు.కేవలం ఆరుగంటల ఇరవై నిమిషాల్లోనే ఛార్మీ విచారణ ముగిసింది.
అయితే అవసరమైతే ఛార్మీ మళ్ళీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఇక డ్రగ్స్ మాఫియాలో మరో కీలక వ్యక్తీని పోలీసులు నిన్న అరెస్టు చేసారు.
ఇతడి పేరు మైక్ కమింగా.నెదర్లాండ్స్ దేశస్థుడు.
ఈరోజు విచారణలో పూరి క్యాంప్ కే చెందిన ముమైత్ ఖాన్ ని ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ముమైత్, స్పెషల్ పర్మిషన్ మీద నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకుంది.
ఈరోజు ఉదయం 10 గంటలకు ముమైత్ విచారణ మొదలవుతుంది.