జుట్టు చిట్లడం( Split Ends ). చాలా మందిని చాలా కామన్ గా కలవరపెట్టే సమస్యల్లో ఇది ఒకటి.
ముఖ్యంగా పొడవాటి జుట్టు కలిగిన వారిని ఈ సమస్య అత్యధికంగా వేధిస్తూ ఉంటుంది.అయితే జుట్టు చిట్లినప్పుడల్లా దాదాపు అందరూ చేసే పని కత్తిరించడం.
కానీ, ఎన్నిసార్లు కత్తిరించిన సరే మళ్లీ మళ్లీ జుట్టు చిట్లిపోతూనే ఉంటుంది.మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.
చిట్లిన జుట్టును కత్తిరించడమే పరిష్కారం కాదు.కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత ఉల్లిపాయ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ నుంచి స్ట్రైనర్ సహాయంతో ఉల్లి రసాన్ని సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి.అలాగే ఉల్లి రసం( Onion juice ), రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్( Aloevera Gel ), రెండు టేబుల్ స్పూన్ల ఆవనూనె వేసుకుని అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే జుట్టు చిట్లడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.అలాగే చిట్లిన జుట్టు ఉన్న సరే రిపేర్ అవుతుంది.ఇక ఈ రెమెడీతో పాటు తడి జుట్టును దువ్వడం, స్టైలింగ్ చేయడం ఆపండి.వేడి వేడి నీటితో తలస్నానం చేసే అలవాటు ఉంటే మానుకోండి.ఎండలో తిరిగేటప్పుడు జుట్టును కవర్ చేసుకోండి.హెయిర్ స్ట్రెయిటెనర్, హెయిర్ డ్రయర్ వినయోగం సైతం తగ్గించండి.