అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మంచి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఆయన చేసే సినిమాల్లో క్వాలిటీ అయితే ఉంటుంది.
అందువల్లే ఆయన సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.తద్వారా సగటు ప్రేక్షకులు సైతం ఆ సినిమాలను ఎక్కువగా చేసే విధంగా ఉండటం విశేషం…
ఇక దాంతో పాటుగా ఆయన రణ్బీర్ కపూర్ తో చేసిన ఆనిమల్ సినిమా( Animal Movie ) రిలీజ్ అయి దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికి ఈ సినిమా మీద ఇప్పటికి బాలీవుడ్ మీడియా విషం కక్కుతూనే ఉంది.
కొంతమంది బాలీవుడ్ మాఫియా వాళ్ళు కలిసి ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు.ఇక ఆ కామెంట్స్ అనేవి ఇప్పటికి కొనసాగుతూ ఉండడం సగటు తెలుగు ప్రేక్షకులను కూడా జీర్ణించుకోలేకుండా చేస్తున్నాయి.
నిజానికి సందీప్ రెడ్డి వంగా తెలుగు దర్శకుడు కావడం వల్ల అతన్ని టార్గెట్ చేసి అలాంటి కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.సందీప్ రెడ్డి వంగ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటాడు.అందువల్లే ఆయన సినిమాల్లో క్వాలిటీ అయితే ఉంటుంది కొంచెం బోల్డ్ కంటెంట్ ఉన్నప్పటికి సినిమాలో ఇన్నర్ గా ఒక ఫ్లో అయితే ఉంటుంది…ఇక ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో( Spirit Movie ) భారీ విజయాన్ని సాధించడానికి సన్నాహాలు చేస్తున్నారు…
.