దేశంలో అత్యంత సంపన్నుల ముఖ్యమంత్రులు వీరే

మన భారతదేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల కలిపి సంపద రూ.1,630 కోట్లు ఉంటుందని అంచనాగా తేలింది.ఈ క్రమంలో, భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu) నిలిచారు.ఆయన సమృద్ధిగా ఉన్న ఆస్తులతో మొదటి స్థానం సొంతం చేసుకున్నారు.ఇక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)మాత్రం కేవలం రూ.15 లక్షల ఆస్తులతో అత్యంత తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రిగా నిలిచారు .మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ(Pema Khandu), రూ.332 కోట్ల నికర విలువతో రెండవ అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా లిస్ట్ లో నిలిచారు.

 These Are The Richest Chief Ministers In The Country, India Richest ,chief Mini-TeluguStop.com
Telugu Andhra Pradesh, India Richest, List, Chandrababu, Omar Abdullah-Latest Ne

అయితే ఇవి అన్ని కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదిక లో తెలిపింది.ఈ సమాచారం మేరకు భారతదేశంలోని 31 ముఖ్యమంత్రుల సగటు సంపద రూ.52.59 కోట్లు.ఈ లిస్టుతో పాటు 2023-2024లో భారతదేశ తలసరి నికర జాతీయ ఆదాయం (ఎన్‌ఎన్‌ఐ) సుమారు రూ.1,85,854 కాగా, ముఖ్యమంత్రుల సగటు స్వీయ ఆదాయం రూ.13,64,310.ఇది భారతదేశ సగటు తలసరి ఆదాయానికి 7.3 రెట్లు ఎక్కువగా ఉంది.అలాగే కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినా ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) రూ.55 లక్షల ఆస్తులతో జాబితాలో రెండవ అతి తక్కువ సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు.ఇక కేరళ ముఖ్యమంత్రి అయినా పినరయి విజయన్ 1.18 కోట్ల రూపాయల ఆస్తులతో మూడవ అతి తక్కువ సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు.ఇక, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా పేమా ఖండూ రూ.180 కోట్ల ఆస్తులతో అత్యధిక సంపద కలిగిన ముఖ్యమంత్రిగా ఉన్నట్లు నివేదికలో తెలిపారు.ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaia) రూ.23 కోట్లు ఆస్తి ప్రకటించారు.కేవలం ఆస్తుల వివరాలే కాకుండా 13 మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారని, 10 మంది (32 శాతం) హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన కేసులను చేర్చారని తెలియచేసింది.

Telugu Andhra Pradesh, India Richest, List, Chandrababu, Omar Abdullah-Latest Ne

నాగాలాండ్ సీఎం నీఫియు రియో ​​మొత్తం ఆస్తులు రూ.46 కోట్లు.అతనికి రూ.8 లక్షల అప్పులు.

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆస్తుల విలువ రూ.42 కోట్లు.అప్పులు – రూ.8 కోట్లు.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆస్తుల విలువ రూ.25 కోట్లు.అప్పులు – రూ.3 కోట్లు.

అస్సాం సీఎం హేమంత బిస్వా శర్మకు రూ.17 కోట్ల ఆస్తులు.అప్పులు – రూ.3 కోట్లు.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆస్తుల విలువ రూ.13 కోట్లు, అప్పులు – రూ.62 లక్షలు.

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆస్తుల విలువ రూ.8 కోట్లు.

హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సుఖు ఆస్తుల విలువ రూ.7 కోట్లు, అప్పులు – రూ.22 లక్షలు.

Telugu Andhra Pradesh, India Richest, List, Chandrababu, Omar Abdullah-Latest Ne

హర్యానా సీఎం నయాబ్ సైనీకి రూ.5 కోట్ల ఆస్తులు, అప్పులు – రూ.74 లక్షలు.

ఉత్తరాఖండ్ సీఎంకు రూ.4 కోట్ల ఆస్తులు, రూ.47 లక్షల అప్పులు ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయికి రూ.3 కోట్ల ఆస్తులు, రూ.65 లక్షల అప్పులు ఉన్నాయి.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు రూ.కోటి ఆస్తులు, రూ.30 లక్షల అప్పులు ఉన్నాయి.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తుల విలువ కోటి రూపాయలు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కోటి రూపాయల ఆస్తులు.

రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మకు కోటి రూపాయల ఆస్తులు, అప్పులు రూ.46 లక్షలు.

ఢిల్లీ సీఎం అతిషికి కోటి రూపాయల ఆస్తులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube