టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు తల్లిదండ్రులు ఎవరు అనగానే.కృష్ణ, విజయ నిర్మల అని చాలా మంది అనుకుంటారు.
కానీ అది నిజం కాదు.మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి.
ఇందిరా దేవి ఉండగా కృష్ణ మరో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఆ పెళ్లికి దారితీసిన కారణాలేంటి? కృష్ణ కుటుంబంలోకి విజయనిర్మల ఎలా వచ్చింది? ఇంతకీ కృష్ణకు పిల్లలు ఎంతమంది? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!
సూపర్ స్టార్ కృష్ణ మామ కూతురు ఇందిరాదేవి.వరుసకు ఆమె తనకు మరదలు అవుతుంది.
అప్పుడే సినిమాల్లో రాణిస్తున్న కృష్ణ కుటుంబ సభ్యుల సలహా మేరకు ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు.ఆయన వివాహం తర్వాత నటించి గూడాచారి చిత్రం బంఫర్ హిట్ అయ్యింది.
ఈ విజయంతో ఆయనకు ఆఫర్లు వెళ్లువెత్తాయి.ఆయనతో ఎక్కువగా విజయ నిర్మల హీరోయిన్‌గా చేసింది.
ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది.ఎవరికీ చెప్పకుండా ఓ ఆయలంలో విజయ నిర్మలను, కృష్ణ పెళ్లి చేసుకున్నాడు.
ఈ వివాహం రహస్యంగా జరిగినా.అనంతరం తన భార్య ఇందిరాదేవితో పాటు కుటంబ సభ్యులందరికీ చెప్పాడు.
కృష్ణకు మొదటిపెళ్లి జరిగిన నాలుగేళ్లకే విజయ నిర్మలను పెళ్లి చేసుకోవడం విశేషం.ఈ పెళ్లి జరిగినా.
తనతోనే ఉంటానని ఇందిరాదేవి చెప్పింది.బతికినంత కాలం ఒకే భర్తగా ఉంటానని చెప్పింది.
కృష్ణకూడా ఆమెను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు.కృష్ణ, ఇందిరాదేవికి ఐదుగురు సంతానం.
వారిలో పెద్దవాడు రమేష్ బాబు.పలు సినిమాల్లో నటించిన ఆయన ప్రొడ్యూసర్ కూడా.
మంజుల, ప్రియదర్శిని, పద్మావతి, మహేష్‌బాబు మిగతా సంతానం.విజయ నిర్మలతో పెళ్లైనా పిల్లల్ని కనలేదు.
ఇందిరా దేవి ఎప్పుడూ బయటకు రాదు.ఫంక్షన్లలోనూ చాలా అరుదుగా కనిపిస్తుంది.కృష్ణ అనగానే విజయ నిర్మలే కనిపిస్తుంది.మంజులకూ ఎంతో ప్రేమ అందుకే తన ప్రొడక్షన్ హౌస్‌కు ఇందిర ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకుంది.ప్రిన్స్ మహేష్‌బాబుకు తన తల్లి అంటే ఎంతో ఇష్టం.పెళ్లికి ముందు తల్లి చాటునే పెరిగాడు.
అందుకే తనంటే మహేష్ కు చాలా మక్కువ.తన పిల్లల్లో ఒకరి వివాహం విషయంలో ఇందిరకు, కృష్ణకు మధ్య వివాదం జరిగింది.
అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది.ఓ వివాహ వేడుకకు ఇందిర వచ్చినప్పుడు మహిష్ ఆమెను రిసీవ్ చేసుకున్నతీరు అందరినీ ఆకట్టుకుంది.
పలు వేడుకల్లో కృష్ణ కుటుంబ సభ్యులంతా కలుస్తారు.కొద్ది రోజుల క్రితం జరిగిన కృష్ణ జన్మదిన వేడుకల్లోనూ ఇందిర, విజయ నిర్మల పాల్గొన్నారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు కృష్ణ రెండో భార్య విజయనిర్మల కన్నుమూశారు.ఇందిరా, కృష్ణల మధ్య వివాహ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది.