నయన్ విఘ్నేష్ పెళ్లి డేట్ ఫిక్సైందా..? పెళ్లి అక్కడేనా..?

ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ తాజాగా సోషల్ మీడియాలో నయనతార రింగ్ పెట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేయడంతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతోంది.అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం పెళ్లి డేట్ తో పాటు పెళ్లి వేదిక కూడా ఫిక్స్ అయిందని ప్రచారం చేస్తుండటం గమనార్హం.

 Heroine Nayanatara Vighnesh Shivan Marriage Date Fixed, Heroine Nayanatara , Vi-TeluguStop.com

మే నెలలోనే నయనతార విఘ్నేష్ శివన్ ల పెళ్లి జరగనుందని తెలుస్తోంది.

తిరుమల తిరుపతికి చెందిన పండితులు నయన్ విఘ్నేష్ ల పెళ్లి మూహూర్తాన్ని ఫిక్స్ చేశారని సమాచారం.

నయనతార విఘ్నేష్ శివన్ ల పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి కొంతమంది బంధుమిత్రులకు మాత్రమే ఆహ్వానం అందనుందని తెలుస్తోంది.ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో నయన్ విఘ్నేష్ ల వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట నిజంగానే పెళ్లి పీటలెక్కుతారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

గతంలో కూడా నయనతార విఘ్నేష్ శివన్ ల పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అయినా ఆ వార్తలు నిజం కాలేదు.

గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో ఉన్న నయనతార కొన్ని కారణాల వల్ల ఇద్దరితో విడిపోయారు.నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లి కోసం నయనతార ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిసున్న నయనతారకు పెళ్లి తర్వాత కూడా ఆఫర్లు తగ్గే అవకాశం అయితే లేదు.

నయనతార వయస్సు 36 సంవత్సరాలు కాగా నయనతార పాటు ఎంట్రీ ఇచ్చిన కొంతమంది హీరోయిన్లు ఇప్పటికే వివాహం చేసుకున్నారు.

మరి నయనతార విఘ్నేష్ శివన్ ల పెళ్లికి సంబంధించిన పెళ్లికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube