పాన్ తిన్న తర్వాత తినకూడని ఆహార పదార్థాలు..

మన భారతదేశంలో చాలామంది ప్రజలు భోజనం చేసిన తర్వాత కిల్లి నములుతూ ఉంటారు.కడుపు నిండుగా భోజనం చేసిన తర్వాత కిల్లి తింటే వారికి అదొక సంతృప్తిగా ఉంటుంది.

 Foods To Avoid After Eating Paan,paan,milk,fruit Juices,digestion Problems, Ph V-TeluguStop.com

అందులోనూ పాన్ లో వాడే తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఆయుర్వేద గ్రంథాలైన చరకసహితం, శుశ్రుత సంహితంలో సంహితంలో తమలపాకు గొప్పతనాన్ని, చికిత్స సామర్థ్యం గురించి వెల్లడించారు.

తమలపాకులు తినడం వల్ల అందులోని పోషకాలు వెచ్చదనాన్ని అందిస్తాయి.

వీటిని తినడం వల్ల కడుపు, ప్రేగుల్లో పి.

హెచ్ అసమతుల్యతను సమర్ధవంతంగా అడ్డుకుంటుంది.జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తమలపాకులు తినడం వల్ల భోజనం జీర్ణం అవుతుందని ఆయుర్వేదంలో ఉంది.తమలపాకును ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.

ఇప్పుడు పాన్ ను రకరకాలుగా తీసుకుంటూ ఉన్నారు.అయితే తిన్న తర్వాత తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించిన విషయం చాలామందికి తెలియదు.

కిల్లి తిన్న తర్వాత ఆహారపదార్థాలు తినేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు.పాన్ తిన్నాక ఒక గంట వరకు ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు.

ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Betel, Cool Waterr, Problems, Fruit, Tips, Milk, Paan, Ph-Telugu Health

కిల్లి తిన్న తర్వాత ఒక గంట వరకు పాలు అస్సలు తాగకూడదు.తాగితే దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.పాన్ తిన్న తర్వాత ఎలాంటి మందులను వేసుకోకూడదు.

లేకుంటే కొందరిలో తలనొప్పి, కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కిల్లి తిన్న తర్వాత ఒక గంట పాటు ఏమి తినకుండా అలా ఉండి ఆ తర్వాత మందులు వేసుకోవడం మంచిది.

Telugu Betel, Cool Waterr, Problems, Fruit, Tips, Milk, Paan, Ph-Telugu Health

కిల్లి తిన్న తర్వాత పండ్ల రసాలు త్రాగకూడదు.ఎందుకంటే అవి నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే మసాలాతో వండిన ఆహార పదార్థాలను కిల్లి తిన్న తర్వాత తినకూడదు.ఇలా తినడం వల్ల మలబద్ధకంతో పాటు జిర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా పాన్ తిన్న తర్వాత చల్లని నీళ్లు తాగడం వలన శ్వాసకోశ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.అందుకోసం చల్లని నీటిని అస్సలు తాగకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube