ఒత్తైన జుట్టు కోసం ఆరాటపడే పురుషులకు బెస్ట్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ఒత్తైన జుట్టు అందాన్ని మరింత పెంచుతుంది.అందుకే మహిళలతో పాటు పురుషులు కూడా ఒత్తైన జుట్టు కోసం ఆరాటపడుతుంటారు.

 This Is The Best Remedy For Men Who Want A Thick Hair! Thick Hair, Hair Pack, Ol-TeluguStop.com

కానీ వేలకు సరిగ్గా తినకపోవడం, ఆఫీస్ లో వర్క్ స్ట్రెస్, మద్యపానం, ధూమపానం, ల్యాప్‌టాప్‌ ముందు గంటలు తరబడి కూర్చోవడం, ఓవర్ గా మొబైల్ వాడటం, కాలుష్యం తదితర కారణాల వల్ల పురుషుల్లో హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా రాలిపోతుంటుంది.దీని కారణంగా కొద్ది రోజుల్లోనే జుట్టు పల్చబడుతుంది.

పల్చటి జుట్టు తో బాధపడే పురుషులలో మీరు ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వెంట్రుక కూడా రాలదు.అదే సమయంలో కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాసు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మ‌రుస‌టి రోజు నానబెట్టుకున్న మెంతుల‌ను ఒక క్లాత్ లో మూట కట్టి రోజంతా వదిలేయాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Thick-Telugu Health

దాంతో మెంతులు మొలకెత్తుతాయి.ఇప్పుడు మొలకెత్తిన మెంతులను మిక్సీ జార్ లో వేసుకోవాలి.అలాగే నాలుగు ఫ్రెష్ జామ ఆకులు( Guava Leaves ), రెండు రెబ్బలు కరివేపాకు మరియు ఒక కప్పు బియ్యం( Rice ) కడిగిన వాటర్ ను వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ వైట్ తో పాటు రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive Oil ) ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Thick-Telugu Health

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.

కాబట్టి ఒత్తైన జుట్టు కోసం ఆరాటపడే పురుషులు ఈ హోమ్ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.మ‌హిళ‌లు కూడా ఈ రెమెడీని పాటించ‌వ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube