పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినీ కెరీర్ ను గమనించినట్లయితే అతను ఆరంభంలో నటించిన చిత్రాలన్నీ ప్రేమ కథలే.అప్పట్లో వరుస ప్రేమ కథలలో నటించడమే కాకుండా వరుస విజయాలు సాధించి “యూత్ ఐకాన్” గా పేరు పొందారు పవన్ కళ్యాణ్.
ఐతే ఆయన తన కెరీర్ లో ఎన్ని ప్రేమ కథలలో నటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో తొలిప్రేమకు( Tholiprema Movie ) ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.ఎందుకంటె తొలిప్రేమ ఆయన కెరీర్ లో నాలుగోవ సినిమా ఐనప్పటికీ… ఆయన నటించిన మొదటి స్ట్రెయిట్ సబ్జెక్టు ఇది.దీనికి ముందు ఆయన నటించిన అక్కడ అమ్మాయి.ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలు అన్ని రీమేక్ సినిమాలే.
అంతేకాకుండా ఆ సినిమాలన్నీ ఈవివి సత్యనారాయణ, భీమినేని శ్రీనివాసరావు, ముత్యాల సుబయ్య వంటి పెద్ద దర్శకులతో చేసిన సినిమాలు.

కానీ తొలిప్రేమకు మాత్రం ఆయన ఎటువంటి అనుభవం లేని కరుణాకరన్ కి( Karunakaran ) దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.వీళిద్దరి కాంబినేషన్లో 1998 లో విడుదలైన ఈ చిత్రం ఒక క్లాసిక్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఐతే ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చర్చ అనుకుంటున్నారా.?ఎందుకంటె ఈ చిత్రం విడుదలయి ఈ జులై 24కు 25 సంవత్సరాలు.ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ చిత్తాన్ని రీ రిలీజ్ చేయడం జరిగింది.
మనం కూడా ఈ చిత్రం తాలూకు జ్ఞాపకాలను నెమరువేసుకుందాం.నటీనటుల విషయానికొస్తే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి( Keerthy Reddy ) హీరోయిన్ గా నటించారు.
జీవీజీ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఆలీ, వేణు మాధవ్, రవిబాబు, నగేష్, సంగీత, విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కరుణాకరన్ కూడా అతిధి పాత్రలో నటించడం విశేషం.దేవా అందించిన సంగీతం తొలిప్రేమ విజయంలో ముఖ్య పాత్ర పోషించింది.సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, ఎస్ పి బాలసుబ్రమణ్యం గానం కుర్రకారుని ఉర్రూతలూగించాయి.ఇందులో మొత్తం ఆరు పాటలు ఉన్నప్పటికీ ఒక్క డ్యూయెట్( Duet ) కూడా లేకపోవడం ఈ చిత్రానికి ఉన్న మరో విశేషం.
దీనికి కారణం ఈ కథ వన్ సైడెడ్ లవ్ స్టోరీ కావడమే.ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ కథ చివరిలో మాత్రమే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటారు.
ఈ చిత్రంలోని ” ఏమయిందో ఏమో ఈ వేళా” అనే పాటని హీరో నిఖిల్ తన గుండె జారీ గల్లంతయ్యిందే చితంలో రీమిక్స్ చెయ్యడం విశేషం.

తొలిప్రేమ 21 కేంద్రాలలో వంద రోజులు, రెండు కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శితమయింది.అంతే కాకుండా 365 రోజులు లాంగ్ రన్ చేసిన సినిమాల జాబితాలో కూడా చేరిపోయింది.1998 సంవత్సరానికిగాను తొలిప్రేమ వివిధ విభాగాలలో ఆరు నంది అవార్డులను, “ఉత్తమ ప్రాంతీయం చిత్రం” విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.అంతే కాదండోయ్… తొలిప్రేమ చిత్రాన్ని 2001లో హిందీలో “ముఝే కుచ్ కెహెనా హై”, 2000 లో “పీటీత్సు తప్పెనిల్లా” అని కన్నడలో రీమేక్ చేయబడింది.







