ఫాల్గుణ మాసంలో ఏయే దేవుళ్లను పూజిస్తే.. ఏయే లాభాలో తెలుసా?

తెలుగు క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం ప్రారంభం అయి పోయింది.అయితే హిందూ సంవత్సరంలో చివరగా వచ్చే ఈ మాసాన్ని ఆనందం, సంతోషాలకు నెలవుగా భావిస్తారు.

 Importance Of Falguna Masam , Devotional, Falguna Masam, Telugu Devotional-TeluguStop.com

అయితే ఈ నెల ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 వరకు సాగనుంది.అయితే ఫాల్గుణ మాసంలోని కొన్ని రోజుల్లో ఈ పూజలు చేస్తే… చాలా మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘ కాలిక రోగాల నుంచి విముక్తి పొందాలనుకునే వారు ఫాల్గుణ మాసంలో శివుడికి పూజలు చేయాలట.ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఫాల్గుణ మాసంలో శివుడితో పాటు లక్ష్మీ దేవికి ఎక్కువగా పూజలు చేస్తుంటారు.

అంతే కాకుండా విష్ణువుకు, శివుడుకి సంబంధించిన ఎక్కువ పండుగలు ఇదే మాసంలో జరుపుకుంటాం.కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహా శివరాత్రి నిర్వహించు కుంటాం.

అయితే శివరాత్రి ఈనెల మార్చి ఒకటో తేదీన వస్తోంది.అలాగే శుక్ల ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువును ఆరాధించడం ఎంతో మంచిది.

ఈ రెండు పండుగలు కూడా హిందువులకు చాలా ముఖ్యమైనవి.అందుకే ఈ ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు పయోవ్రతం ఆచరించి శ్రీ మహా విష్ణువుకు క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తే అభీష్ట సిద్ధి కల్గుతుంది.

పురాణాల్లో దితి, అదితిలలలో అదితి ఫాల్గుణ మాసంలో ఈ పయో వ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందినట్లు పురాణాల్లో ఉంది.అయితే శివ, విష్ణులకప ఇష్టమైన ఈ మాసంలో గోదానం, వస్త్ర ధానం, పేదలకు అన్నదానం లాంటివి చేయడం చాలా మంచిది.

Importance Of Falguna Masam , Devotional, Falguna Masam, Telugu Devotional - Telugu Devotional, Falguna Masam, Phalguna Masam

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube