ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఉన్నా సుదీర్ఘకాలంగా కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.డిల్లీ బ్యూటీ అయిన రకుల్ ప్రస్తుతం తెలుగు సినిమాలతో పోలిస్తే ఇతర భాషల సినిమాలతో బిజీగా ఉన్నారు.

 Rakul Preet Singh Childhood Pictures Goes Viral In Social Media, Child Hood Phot-TeluguStop.com

ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ప్రతిభ పుష్కలంగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ అడుగులు వేయడం కూడా రాకముందే స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఉండటం గమనార్హం.

తన తండ్రితో కలిసి ఈ బ్యూటీ చిన్న వయస్సులోనే ఫోటోలకు ఫోజులివ్వగా ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.టాలీవుడ్ లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించిన రకుల్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఒక దశలో వరుస ఫ్లాపులు వచ్చినా, వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా రకుల్ మాత్రం నటిగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.అవకాశాలు తగ్గిన ప్రతిసారి హిట్ సాధిస్తూ రకుల్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

కెరటం సినిమాతో రకుల్ కెరీర్ ను మొదలుపెట్టినా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో రకుల్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది.ఆ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లతో పాటు ఇతర భాషల్లో కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.

రకుల్ కు ఒక సీనియర్ స్టార్ హీరో సినిమాలో కూడా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.బాలీవుడ్ లో రకుల్ నటించిన సినిమాలు సక్సెస్ అయితే అక్కడ కూడా ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Telugu Child Hood, Rakulpreet-Movie

రకుల్ చిన్నప్పటి ఫోటోలను ఆమె అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు రకుల్ క్యూట్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు.ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిచ్చే రకుల్ కొత్త హీరోయిన్ల నుంచి పోటీ ఎదురవుతున్నా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube