అసలే వర్షాకాలం.ఈ సీజన్‌లో ప్రధానంగా వేధించే సమస్యల్లో జలుబు ముందు వరసలో ఉంటుంది.
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ జలుబు వేధిస్తూనే ఉంటుంది.దాంతో జలుబును వదిలించుకోవడం కోసం మందులు వాడుతూ ఉంటారు.
అయితే మెడికల్ షాపులో ఉండే మందులే కాదు.వంటింట్లో ఉండే కొన్ని కొన్ని ఆహార పదార్థాలు సైతం జలుబుకు బెస్ట్ మెడిసిన్‌లా పని చేస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆహార పదార్థాలు ఏంటో.? వాటిని ఎలా ఉపయోగించాలో.? ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజలు.
జలుబును తగ్గించడానికి అద్భుతంగా సహాయపడతాయి.స్టవ్‌పై గిన్నె పెట్టి గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని.
నిమ్మరసం, తేనెలను కలిపి సేవించాలి.ఇలా చేస్తే జలుబు త్వరగా తగ్గిపోతుంది.

అలాగే వంటింట్లో ఉండే క్యారెట్ జలుబును నివారించేందకు ఓ సహజ మెడిసిన్‌లా పని చేస్తుంది.జలుబు చేసినప్పుడు రోజుకో గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తీసుకోవాలి.ఇలా చేస్తే జలుబు వేగంగా తగ్గడమే కాదు.మళ్లీ మళ్లీ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.అదే సమయంలో రోగ నిరోధక వ్యవస్థ సూపర్ స్ట్రోంగ్‌గా సైతం మారుతుంది.

దాల్చిన చెక్కతోనూ జలుబును తరిమి కొట్టవచ్చు.అందుకోసం ఒక గ్లాసు వేడి నీటిలో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి సేవించాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే జలుబు మాత్రమే కాదు దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు కూడా పరార్ అవుతాయి.
