సాధారణంగా హలీం( Haleem ) వెనుక ఎవరికీ తెలియని కొన్ని గొప్ప విషయాలు ఉన్నాయి.హలీంకు గొప్ప చరిత్ర ఉందని నిపుణులు చెబుతున్నారు.
కేవలం ముస్లింలు( Muslims ) మాత్రమే కాకుండా అందరూ కూడా హలీమ్ ని ఎంతో ఇష్టంగా తింటారు.ముఖ్యంగా చెప్పాలంటే రంజాన్ సమయంలో ఎక్కడ చూసినా హలీం దుకాణాలు ఉంటాయి.
హలీం తినడానికి చిన్న పెద్ద ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు.ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
రోజంతా ఉపవాసం ఉండడం వల్ల హలీమ్ తింటే మళ్లీ తిరిగి శక్తిని పొందవచ్చు అని చెబుతున్నారు.ఎంతోమంది ఇష్టంగా తినే ఈ హలీంని మన దేశానికి అరేబియన్స్ తీసుకొచ్చారు.10వ శతాబ్దంలో కితాబు హాల్ తబిక్ వంటల పుస్తకంలో హలీమ్ రెసిపీ గురించి మొదటిసారిగా రాశారు.హలీమ్ ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు.
అరేబియన్ వారు హరిస్( Harees ) అంటారు.టర్కీ, ఇరాన్, అజర్, ఇరాక్ లో దలీమ్ అని పిలుస్తారు.
పాకిస్తాన్ లో కిచ్రా అని పిలుస్తారు.మటన్, చికెన్ తో హారిస్ తయారు చేస్తారు.
చూసేందుకు పేస్టులా మెత్తగా ఉంటుంది.ఇందులో ఉపయోగించే పదార్థాలు అన్నిటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
గోధుమలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, శనగపప్పు, మినప్పప్పు వేస్తారు.అంతేకాకుండా మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, నల్ల మిరియాలు, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ పిస్తా, జీడిపప్పు, అంజీర, బాదంపప్పు కూడా వేస్తారు.
దానిమీద కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్క వేసి గానూష్ వేస్తారు.ముఖ్యంగా నెయ్యి వేసుకుని తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది.క్యాలరీలు అధికంగా ఉండే హలీం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఇది తక్షణమే శరీరానికి శక్తిని అందిస్తుంది.ఇందులో ఉండే పీచు పదార్థం కారణంగా ఇది నెమ్మదిగా జీర్ణం అవుతుంది.అందువల్ల పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది.
ఇందులో ఉండే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
అంతేకాకుండా హరిస్ లో ఉపయోగించే మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ అధిక రక్తపోటు, మధుమేహం తో బాధపడే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా చెప్పాలంటే హరీస్ తయారు చేయడానికి దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది.అందుకే అద్భుతంగా ఉంటుంది.