చాలామందికి గ్రీన్ టీ( Green Tea ) అలవాటు ఎక్కువగా ఉంటుంది.గ్రీన్ టీ తాగడం వలన వారికి రిలాక్సేషన్ గా అనిపించి గ్రీన్ టీ ని అలవాటుగా చేసుకుంటారు.
అయితే గ్రీన్ టీ తాగడం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.ఇది మన అందరికీ తెలిసిన విషయమే.
ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు శరీరానికి పోషకాలను అందించి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి.అయితే గ్రీన్ టీ లో విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం ఇలాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందుకే సులభంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.అయితే ఈ టీ పురుషుల కంటే స్త్రీలకు చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.కానీ అతిగా తాగడం వలన కూడా పలు అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.కాబట్టి గ్రీన్ టీను మోతాదుకు మించి తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే వైద్య నిపుణులు కొందరిని గ్రీన్ టీ అస్సలు తాగకూడదు అని సూచిస్తున్నారు.అయితే గర్భిణీ స్త్రీలు( Pregnant Women ) గ్రీన్ టీ తాగడం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే గ్రీన్ టీలో కాటెచిన్ సమ్మేళనం ఉంటుంది.ఇది గర్వధారణకు ముందు తీవ్రనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.అలాగే పుట్టబోయే పిల్లలకు కూడా హాని కలిగిస్తుంది.అదేవిధంగా కంటి శుక్లం, ఇతర కంటి సమస్యలు( Eye Problems ) తో బాధపడుతున్న వారు గ్రీన్ టీ తాగకపోవడం చాలా మంచిది.
ఎందుకంటే గ్రీన్ టీ కళ్ళకు చాలా హానికరం.ఇక జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు కూడా గ్రీన్ టీ ని తాగకపోవడమే మంచిది.
ఇందులో ఉండే టానిన్ అనే మూలకం కడుపులో యాసిడ్ నీ పెంచడానికి దోహదపడుతుంది.అందుకే జీర్ణ క్రియ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండాలి.
ఇక రక్తహీనత సమస్యలు ఉన్నవాళ్లు కూడా గ్రీన్ టీ ని తీసుకోకపోవడమే మంచిది.ఎందుకంటే గ్రీన్ టీ తీసుకోవడం వలన ఐరన్ లోపం( Iron Deficiency ) సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
దీంతో రక్తహీనత, రక్తపోటు లాంటి సమస్యలకు దారి తీయొచ్చు.







