ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.ఇందులో ప్రధానంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులతో పాటు విపక్షాలు లేవనెత్తే అంశాలపై కేంద్ర మంత్రివర్గం చర్చించనుంది.
కాగా రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి ప్రధానమంత్రి మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.కాగా వర్షాకాల సమావేశాలకు అధికార, విపక్ష నేతలు అస్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు.
మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో పలు బిల్లులు చర్చకు రానున్నాయి.ఉమ్మడి పౌరస్మృతి బిల్లుతో పాటు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు, ఢిల్లీలో పాలనాధికారాలపై ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.







