టోటల్ ఇండియా అంతటా ప్రస్తుతం ఆది పురుష్( Adipurush ) ట్రెండ్ నడుస్తోంది…గత మూడు రోజులుగా ఎక్కడ పెని క్రేజ్ తో ఈ సినిమా ముందుకు దూసుకెళ్తుంది… బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్( Prabhas ), సైఫ్ అలీఖాన్ నటించారు…ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.ఈ సినిమా పై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా మొదటి షో నుండే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఆదిపురుష్ సినిమాలో శూర్ఫణఖగా తేజస్విని పండిట్( Tejashwini pandit ) నటించింది.
ఆమె ఎవరు? ఈ మూవీకి ముందు ఆమె ఏం చేసేవారో ఇప్పుడు చూద్దాం.
రామాయణం ఇతిహాసంలోని ప్రధాన పాత్రల్లో శూర్పణఖ కూడా ఒకటి.
ఆమె లంకాధిపతి రావణాసురుడి చెల్లెలు.శూర్పణఖ రాముడు వనవాసంలో ఉన్న సమయంలో చూసి ఇష్టపడుతుంది.
ఆ విషయం గురించి రాముడికి చెబుతుంది.అయితే ఆ సమయంలో లక్ష్మణుడు వచ్చి శూర్పణఖ ముక్కును కొస్తాడు.
ఈ క్యారెక్టర్ ను ఆదిపురుష్ సినిమాలో చూపించారు.తేజస్విని పండిట్ శూర్పణఖ క్యారెక్టర్ లో నటించింది….

ఆదిపురుష్ సినిమాలో క్రూరమైన శూర్పణఖగా కనిపించిన తేజస్విని పండిట్ నిజ జీవితంలో ఆమె ఒక స్టార్ హీరోయిన్.మరాఠా సినీ ఇండస్ట్రీలో తేజస్విని పాపులర్ హీరోయిన్.తేజస్విని పండిట్ 2004 లో రిలీజ్ అయిన మారాఠి సినిమా ‘అగా బాయి అరేచా’ తో సినీ కెరీర్ మొదలు పెట్టింది.ఆమె తొలి సినిమాలోనే నెగిటీవ్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది.
తేజస్విని సినిమాలలోనే కాకుండా టెలివిజన్ ఆడియెన్స్ కూడా ఆకట్టుకుంది….

తేజస్విని బెస్ట్ హీరోయిన్ గా అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డులను పొందింది.తేజస్విని తెరపైనే కాకుండా బయట కూడా చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది.తేజస్విని తన చిన్ననాటి ఫ్రెండ్ భూషణ్ బోప్చేని 2012లో పెళ్లి చేసుకున్నారు.
భూషణ్ బిజినెస్ రామేశ్వర్ రూప్‌చంద్ బోప్చే కుమారుడు.తేజస్విని పండిట్ ఇటీవల వెబ్ సీరీస్ లో నటిస్తుంది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉటుంది.తరచు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది…
.