అమెరికాలో భారతీయ విద్యార్ధి దారుణహత్య

అమెరికాలో( America ) భారతీయులపై మరోసారి విద్వేష దాడులు పెరుగుతున్నాయి.రెండ్రోజుల క్రితం ఫ్లోరిడాలోని పామ్స్‌వెస్ట్ ఆసుపత్రిలో ఓ 67 ఏళ్ల భారత సంతతి నర్సుపై రోగి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

 Indian Student From Telangana Shot Dead In Us Details, Indian Student ,telangana-TeluguStop.com

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన హెలికాఫ్టర్‌లో మరో ఆసుపత్రికి తరలించారు.బాధితురాలి ముఖంలో ఎముకలు విరిగిపోవడంతో పాటు ఆమె చూపు కూడా కోల్పోయే అవకాశం ఉందని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈ ఘటనను మరిచిపోకముందే అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది.చికాగోలో( Chicago ) జరిగిన కాల్పుల్లో తెలంగాణలోని( Telangana ) రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడిని విస్కాన్సిన్ – మిల్వాకీ యూనివర్సిటీలో( Wisconsin – Milwaukee University ) పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న జీ.ప్రవీణ్‌గా( G Praveen ) గుర్తించారు.ఇతను అక్కడ చదువుకుంటూనే ఓ స్టోర్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రవీణ్ మరణవార్తను అమెరికా అధికారులు అతని కుటుంబానికి తెలియజేశారు.

Telugu Praveen, Praveen Chicago, Indian, Ranga, Telangana, Telangana Usa-Telugu

ప్రవీణ్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.తనకు ఉదయం 5 గంటలకు వాట్సాప్ కాల్ వచ్చిందని, దానికి తాను స్పందించకపోవడంతో కాసేపటికీ వాయిస్ మెసేజ్ పంపానని చెప్పారు.గంట తర్వాత కూడా ప్రవీణ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కంగారుపడి అతని స్నేహితులకు ఫోన్ చేసినట్లు రాఘవులు తెలిపారు.

దుకాణంలో దోపిడి దొంగలు ప్రవీణ్‌ని కాల్చి చంపినట్లు తనకు చెప్పారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.పోస్ట్‌మార్టం తర్వాతే ప్రవీణ్ మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అమెరికా అధికారులు తెలిపారు.

ప్రవీణ్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి 2023లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లాడు.

Telugu Praveen, Praveen Chicago, Indian, Ranga, Telangana, Telangana Usa-Telugu

ప్రవీణ్ దారుణహత్యపై చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఆవేదన వ్యక్తం చేసింది.ప్రవీణ్ కుటుంబం, విశ్వవిద్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామని.వారికి అన్ని విధాలుగా సాయం చేస్తామని ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

అయితే అమెరికాలో తెలంగాణకు చెందిన విద్యార్ధి హత్యకు గురికావడం ఇదే తొలిసారి కాదు.గత ఐదు నెలల్లో ఇది మూడో కేసు.2024 నవంబర్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక విద్యార్ధి, 2025 జనవరిలో హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్ధి కూడా ఇలాగే కాల్పుల్లో చనిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube