బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో కన్నడ ముద్దుగుమ్మ యష్మి గౌడ ( Yashmi Gowda ) ఒకరు.ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టి తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్( Krishna Mukunda Murari ) ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించారు.
ఈ పాత్ర ద్వారా మంచి మార్కుల సొంతం చేసుకున్న ఈమె అనంతరం ఎలాంటి సీరియల్స్ లో నటించకపోయిన బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss 8 ) కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా సీరియల్లో నెగిటివ్ పాత్రలో చూసిన ఈమెను బిగ్ బాస్ కార్యక్రమంలో చూసి అందరూ షాక్ అయిపోయారు.ఇక ఈమె అల్లరి పనులతో బిగ్ బాస్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు.ఇక ఈ కార్యక్రమా ద్వారా మరి కొంతమంది అభిమానులను సొంతం చేసుకున్న యశ్మికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలు చూసినా అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రకటించలేదు కానీ ఒక్కసారిగా పెళ్లికూతురుగా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.

తాజాగా ఈమెకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో భాగంగా ఈమె హల్ది ( Haldi ) వేడుక ఘనంగా జరిగిందని తెలుస్తోంది.ఇలా హెల్ది వేడుకలలో భాగంగా మంగళ స్నానాలు చేస్తూ ఉన్నటువంటి ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అదేంటి యశ్మీ పెళ్లి చేసుకోబోతోందా అంటూ అందరూ షాక్ అవుతున్నారు కానీ ఈమె నిజంగానే పెళ్లి చేసుకోలేదని బహుశా ఏదో ఒక కొత్త ప్రాజెక్టు కోసమే ఇలా నటించబోతున్నారని స్పష్టమవుతుంది.ఏది ఏమైనా ఈ ఫోటోలు కొందరికి షాకింగ్ అనిపించగా మరికొందరు తొందరగా పెళ్లి చేసుకోవాలని కూడా కామెంట్లు చేస్తున్నారు.







