విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ వచ్చిన మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ నీ సొంతం చేసుకుంది.
విజయ్ దేవరకొండ కి హీరోయిన్ గా అనన్య పాండే నటించగా తల్లిగా రమ్యకృష్ణ ఒక మంచి పవర్ఫుల్ పాత్రలో నటించింది.ఇక ఈ సినిమాలో రియల్ ఫైటర్ మైక్ టైసన్ కూడా ఉండడం విశేషం.
అయితే ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయంపై లోతైన విశ్లేషణ చేస్తే ఐదు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూరి నాసిరకం స్క్రీన్ ప్లే, కథ
పూరి జగన్నాథ్ సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు.బలమైన కథ అలాగే స్క్రీన్ ప్లే, అందరినీ ఆకర్షించే డైలాగులు.ఇది కూడా సినిమాలో లేకపోవడం ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్.
హీరోయిన్ అనన్య పాండే
అసలు అనన్య పాండే అనే ఒక హీరోయిన్ ని తీసుకోవడమే ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.ఆమెను ఎందుకు తీసుకున్నారు ఎవ్వరికీ అర్థం కాకపోగా హీరోయిన్ కి హీరో కి ఉన్న సన్నివేశాలు కూడా చాలా తక్కువ.

పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్
ఇలాంటి ఒక ఫైటింగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం.కానీ ఈ సినిమాలో ఉన్న సంగీతం ఎవరిని ఆకర్షించకపోగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమాత్రం సెట్ కాలేదని అనిపించింది.దీంతో ఈ సినిమాకి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మైనస్ గా మారాయి.
సినిమాలో మిస్సయిన పాత్రలు
ఇక ఈ సినిమాకు వచ్చేసరికి రమ్యకృష్ణ ఎప్పుడూ తన భర్త గురించి చెప్తూ ఉంటుంది.కానీ సినిమా మొత్తం అయిపోయినా కూడా ఆ భర్త ఎవరు అనే విషయం చెప్పడం పూరి జగన్నాథ్ మర్చిపోయాడు.
అసలు ఈ సినిమాకి విలన్ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

హీరో నత్తి
విజయ్ దేవరకొండ పాత్రకు నత్తి పెట్టాలని పూరి జగన్నాథ్ తీసుకున్న నిర్ణయం అతిపెద్ద మైనస్ పాయింట్ గా మారింది ఈ చిత్రానికి.ఇక ఎప్పుడైనా హీరో నత్తి మాట్లాడాలనుకున్న చుట్టూ ఉన్న పాత్రలు విషయాన్ని అర్థం కాకుండా చేయడంతో అతడు నత్తి మాట్లాడాడ లేక బూతులు మాట్లాడాలో తెలియకపోవడంతో ప్రేక్షకుడికి సగం విరక్తి పుట్టింది.