RC 16 నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ అవుట్… వైరల్ అవుతున్న పోస్టర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) ఇటీవల గేమ్ చేంజర్( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 Janhvi Kapoor First Look Out From Rc 16 Movie-TeluguStop.com

దీంతో తదుపరి సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకోవాలని కసితో చరణ్ తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు.ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.

రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు ( Bucchi Babu ) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమా ప్రస్తుతం RC 16 అనే వర్కింగ్ పాటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలు మేకర్స్ ఉన్నట్టు సమాచారం.

ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇదివరకే ఎన్టీఆర్ తో దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు.

Telugu Bucchi Babu, Janhvi Kapoor, Janhvikapoor, Ramcharan, Rc-Movie

ఇక రామ్ చరణ్ సరసన జాన్వీ నటించబోతున్నారని తెలియడంతో సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఇక నేడు నటి జాన్వీ కపూర్ పుట్టినరోజు( Janhvi Kapoor Birthday ) కావడంతో ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో భాగంగా ఈమె టి షర్ట్ నైట్ ప్యాంటు ధరించి చేతిలో గడ్డి పోచను పట్టుకొని, మరో చేతిలో గొర్రె పిల్లను ఎత్తుకొని ఎంతో అందంగా క్యూట్ గా కనిపించారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Bucchi Babu, Janhvi Kapoor, Janhvikapoor, Ramcharan, Rc-Movie

ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ బుచ్చి బాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు ఈ సందర్భంగా జాన్వీ కపూర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అలాగే మిమ్మల్ని తెరపై చూడటం కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఈయన జాన్వీకి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube