విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒకటైన విటమిన్ బి9 నే ఫోలిక్ యాసిడ్ అని అంటారు.శరీరానికి ఫోలిక్ యాసిడ్ అనేది ముఖ్యమైన పోషకం.
ఇది శరీరంలో కొత్త కణాలను తయారు చేయడంలో, వాటికి పోషణ అందించడంలో ఉపయోగపడుతుంది.అటువంటి ఫోలిక్ యాసిడ్ లోపిస్తే శరీరంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి.
అవేంటి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోలిక్ యాసిడ్ లోపం ఏర్పడితే.
ముందుగా ఎదురయ్యే సమస్య రక్త హీనత.అవును, ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది.దాంతో రక్త హీనత బారిన పడతారు.శరీరంలో ఫోలిక్ యాసిడ్ తగ్గిపోయినప్పుడు నీరసం ఎక్కువగా ఉంటుంది.ఏ చిన్న పని చేసినా అలసి పోతుంటారు.ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టం అవుతుంది.
తరచూ తలనొప్పి ఇబ్బంది పెడుతుంది.ఏకాగ్రత్త క్రమంగా క్షీణిస్తుంది.అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఆరోగ్యవంతమైన బేబీకి జన్మనివ్వాలన్నా, వారి కాన్పు సజావుగా జరగాలన్నా ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండడం తప్పనిసరి.లేకుంటే పుట్టబోయే పిల్లల్లో అనేక లోపాలు తలెత్తుతాయి.
ముఖ్యంగా పుట్టబోయే పిల్లల్లో మెదడు, వెన్నెముక సమస్యలు ఏర్పడతాయి.
ఇక శరీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే.
ఉన్నట్టు ఉండి బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, తరచూ మగతగా ఉండటం, కంటి నరాల్లో క్షీణత ఇలా ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడతాయి.కనుక ఎవరైనా సరే ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.
దీంతో ఫోలిక్ యాసిడ్ లోపానికి దూరంగా ఉండోచ్చు.కాగా, పాలకూర, తోటకూర, పుదీనా, పప్పు ధాన్యాలు, నట్స్, మాంసం, గుడ్లు, పాలు, బీన్స్, చిక్కుడు జాతి గింజలు, నిమ్మజాతి పండ్లు వంటి వాటిలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
కాబట్టి, వీటిని తరచూ తీసుకుంటే మంచిది.
.