చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

వినికిడి లోపం. వ‌య‌సు పైబ‌డే కొద్ది కోట్లాది మందిని తీవ్రంగా మ‌ద‌న పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

 Ways To Avoid Hearing Loss Details! Hearing Loss , Hearing Power, Latest News, H-TeluguStop.com

ఏజ్ పెరిగే కొద్ది వినికిడి శ‌క్తి లోపించ‌డం స‌ర్వ సాధార‌ణం.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది చిన్న వ‌య‌సు నుంచే ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.

ఈ లిస్ట్‌లో మీరు ఉండ‌కూడ‌దు, చెవిటి వారు కాకూడ‌దు అని భావిస్తే త‌ప్ప‌నిస‌రిగా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ చూపు చూసేయండి.

రోజూ స్నానం చేసేట‌ప్పుడు, లేదా స్విమ్మింగ్ చేసేట‌ప్పుడు చెవుల్లోకి నీళ్లు వెళ్తుంటాయి.అయితే ఆ నీటిని చాలా మంది క్లీన్ చేసుకోరు.ఇలా ప్ర‌తి సారి చెవులను తడిగా ఉంచుకోవ‌డం వ‌ల్ల ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంటుంది.ఈ క్ర‌మంలోనే వినికిడి శ‌క్తీ త‌గ్గిపోతుంది.

అందుకే స్నానం లేదా స్విమ్మింగ్ చేసిన త‌ర్వాత ఖ‌చ్చితంగా చెవుల్లోకి వెళ్లిన నీటిని కాట‌న్ క్లాత్ లేదా దూది సాయంతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

అలాగే కొంద‌రు గంట‌లు గంట‌లు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు.

ఈ అల‌వాటు మీకూ ఉంటే వెంట‌నే మానుకోండి.

Telugu Clean Ears, Ear, Ears, Fungal, Tips, Problems, Improve, Latest, Sound-Tel

ఎందుకంటే, ఎక్కువ సేపు ఫ్లోన్ మాట్ల‌డం వ‌ల్ల వినికిడి శ‌క్తి త‌గ్గిపోయి చెవిటి వారు అయ్యే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది.

చాలా మంది ఇయ‌ర్ ఫోన్స్‌ను తెగ వాడుతుంటారు.ఇది కూడా వినికిడి శ‌క్తి కోల్పోవ‌డానికి ఒక కార‌ణం అవుతుంది.

కాబ‌ట్టి, రోజుకు ఒక గంట‌కు మించి ఇయ‌ర్ ఫోన్స్‌ను వాడ‌రాదు.

కొంద‌రు రీ సౌండ్‌తో టీవీలు చూడ‌టం, పాట‌లు విన‌డం చేస్తుంటారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల చెవుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.అది కాస్త వినికిడి లోపం ఏర్పడే దాకా వెళ్తుంది.

కాబ‌ట్టి, టీవీ చూసేట‌ప్పుడు, సాంగ్స్ వినేట‌ప్పుడు త‌క్కువ సౌండ్‌ను ప్రిఫ‌ర్ చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube