మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ సి( Vitamin C ) ముందు వరుసలో ఉంటుంది.రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో విటమిన్ సి కీలక పాత్రను పోషిస్తుంది.
అలాగే తెల్ల రక్త కణాలు, యాంటీబాడీల ఉత్పత్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో, కణాలను దెబ్బతీసే మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దోహదపడే ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడంలో, ఐరన్ ను గ్రహించడంలో, రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో.ఇలా చెప్పుకుంటే పోతే అనేక విధాలుగా విటమిన్ సి ఉపయోగపడుతుంది.
అందుకే నిత్యం మనం మన బాడీకి విటమిన్ సి ను అందించాలి.అయితే విటమిన్ సి అనగానే చాలా మందికి ఆరెంజ్,( Orange ) లెమన్( Lemon ) మాత్రమే గుర్తుకువస్తాయి.
కానీ ఈ రెండింటి కన్నా ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ లోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లో స్ట్రాబెర్రీలు( Strawberries ) ముందు వరుసలో ఉంటాయి.ఒక కప్పు స్ట్రాబెర్రీ ముక్కలు తీసుకుంటే 97 మిల్లీ గ్రాములు విటమిన్ సి ని పొందుతారు.పైగా స్ట్రాబెర్రీల్లోని ఇతర పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.మెదడు పనితీరును పెంచుతాయి.
బొప్పాయి.( Papaya ) రుచికరమైన పండే కాదు పోషకాలకు కూడా పవర్ హౌస్ లాంటిది.ముఖ్యంగా బొప్పాయిలో విటమిన్ సి మెండుగా ఉంటుంది.విటమిన్ ఎ కు కూడా బొప్పాయి గొప్ప మూలంగా చెప్పబడింది.
ఎల్లో క్యాప్సికమ్ లో( Yellow Capsicum ) కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఒక పెద్ద ఎల్లో క్యాప్సికమ్ 342 మిల్లీ గ్రాముల విటమిన్ సిని అందిస్తుంది.
మరియు మొత్తం ఆరోగ్యానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను కూడా ఎల్లో క్యాప్సికమ్ ద్వారా పొందవచ్చు.ఇక పాలకూర, జామకాయలు, నల్ల ఎండుద్రాక్ష, మిరపకాయలు, బ్రస్సెల్స్ మొలకలు, కివి, బ్రోకలీ వంటి ఆహారాల్లో కూడా విటమిన్ సి మెండుగా నిండి ఉంటుంది.