రాత్రి మనకైనా టైంకి నిద్రపట్టడం కష్టంగా ఉంటుంది.నిద్రపట్టినా, ఒక్కోసారి ప్రశాతంగా, 7-8 గంటలు కునుకు తీయడం కష్టం.
అలాంటిది గర్భిణి స్త్రీలకు ఎంత కష్టంగా ఉంటుందో ఊహించండి.శరీరంలో ఎప్పటికప్పుడు జరిగే మార్పుల వలన నిద్రలేమి సమస్యలతో బాధపడే ప్రెగ్నెంట్ మహిళలు ఎందరో.
అలాంటి సమస్యే ఉంటే, కొన్ని జాగ్రత్తలు పాటించి నిద్రను కూడా సరిగా ప్లాన్ చేసుకోవాలి.
* ఎవరైనా సరే, ముఖ్యంగా గర్భిణి స్త్రీలు పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు ఏమి తినకూడదు.
లేదంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ సమయ్స తలెత్తి నిద్ర సరిగా పట్టదు.
* గర్భంతో ఉన్నప్పుడు చీటికిమాటికి లేవడం పడుకోవడం ఇబ్బందే.
కాబట్టి పడుకునే ముందు నీరు ఎక్కువ తాగకూడదు.లేదంటే పలుమార్లు నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
* కొంతమంది మహిళలు మధ్యాహ్నం బాగా నిద్రపోయి, విశ్రాంతి తీసుకోవాల్సిన రాత్రి సమయంలో నిద్రపట్టక ఇబ్బందిపడుతుంటారు.కాబట్టి మధ్యాహ్నం ఓ అరగంట నుంచి గంట నిద్ర సరిపోతుంది.
* ఒక్కోసారి నిద్రపట్టకపోతే అలానే మంచంలో ప్రయత్నాలు చేసే బదులు, చిన్నగా వాకింగ్ చేసి మళ్ళీ విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయాలి.
* డిన్నర్ లోకి లైట్ ఆహారం తీసుకోవడంతో పాటు, దిండు సరైన ప్రదేశంలో వాడాలి.