సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లు అన్నీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది అంటూ నిర్మాత శిరీష్( Producer Shirish ) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అని శిరీష్ అన్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి గారికి మేము మొదట థ్యాంక్స్ చెప్పాలని శిరీష్ చెప్పుకొచ్చారు.హరి గారు లేకపోతే మేము పటాస్ మూవీ చూసేవాళ్లం కాదని అనిల్ రావిపూడి ఈరోజు మాతో ఉండేవాడు కాదని చెప్పుకొచ్చారు.
అప్పుడు మా కాంపౌండ్ లోకి వచ్చిన అనిల్ రావిపూడిని( Anil Ravipudi ) బయటకు పోనీయడం లేదని శిరీష్ పేర్కొన్నారు.మేము బావిలో పడిపోతున్నామని ఎంతోమంది సంతోషపడేలోపు ఈ సినిమా మమ్మల్ని ఒడ్డున పడేసిందని పేర్కొన్నారు.వెంకటేశ్( Venkatesh ) నిర్మాతల హీరో అని వెంకటేశ్ ఎప్పుడూ నిర్మాతల క్షేమమే కోరుకుంటారని శిరీష్ వెల్లడించగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer Movie ) ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం దిల్ రాజు( Dil Raju ) కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ సాధించడం దిల్ రాజు, శిరీష్ లను ఒడ్డున పడేసింది.సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మూడు రోజుల్లో ఏకంగా 106 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.సెకండ్ వీకెండ్ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచిన సినిమాలలో ఒకటని చెప్పవచ్చు.