బెండకాయ. చాలా మంది ఇష్టంగా తినే కూరగాయల్లో ఇది ఒకటి.రుచి పరంగానే కాదు.పోషకాల పరంగానూ బెండకాయ బ్రహ్మాండం అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.గుండెను ఆరోగ్యంగా కాపాడటంలోనూ, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేయడంలోనూ, మెదడు పని తీరు రెట్టింపు చేయడంలోనూ, రక్తహీనతను తరిమి కొట్టడంలోనూ.ఇలా చెప్పుకుంటూ పోతే బెండకాయతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే ఆరోగ్యానికే కాదు.జుట్టు సంరక్షణ్యకు కూడా బెండకాయ ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా బెండకాయలతో హెయిర్ మాస్క్ వేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.
ముందుగా ఐదు నుంచి ఎనిమిది బెండకాయలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించుకున్న బెండకాయ ముక్కలను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన వెంటనే వాటర్‌తో సహా బెండకాయ ముక్కలను మిక్సీ జార్‌లో వేపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సాయం పాల్ప్‌ను తొలగించాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి.వీక్లీ వన్స్ ఈ హెయిర్ మాస్క్‌ను ట్రై చేస్తే జుట్టు రాలడం, పొట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
డ్రై హెయిర్ సమస్య దూరం అవుతుంది.జుట్టు సిల్కీగా మరియు షైనీగా కూడా మెరుస్తుంది.