యాపిల్.( Apple ).అద్భుతమైన పండ్లలో ఇది ఒకటి.రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం రాదని వైద్యులు చెబుతుంటారు.
ఎందుకంటే యాపిల్ లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.అవి మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ఆరోగ్యానికే కాదు అందానికి మెరుగులు పెట్టడానికి కూడా యాపిల్ ఉపయోగపడుతుంది.ఇప్పుడు చెప్పబోయే విధంగా యాపిల్ తో ఫేస్ మాస్క్ వేసుకుంటే బోలెడు లాభాలు పొందొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం యాపిల్ ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా చిన్న యాపిల్ ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు యాపిల్ ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, ( Oats powder )హాఫ్ టేబుల్ స్పూన్ తేనె,( Honey )చిటికెడు దాల్చిన చెక్క పొడి,( Cinnamon powder ) రెండు స్పూన్ల పాలు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే ముడతలు, చర్మం సాగటం, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది.చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా పరార్ అవుతాయి.మొటిమలు ( pimples )రావడం కంట్రోల్ అవుతాయి.
యాపిల్ లో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని బ్రైట్ గా షైనీ గా మెరిపిస్తాయి.క్లియర్ స్కిన్ ను అందిస్తాయి.
కాబట్టి అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ యాపిల్ ఫేస్ మాస్క్ ను ప్రయత్నించండి.