టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.దర్శనం అనంతరం నారావారా పల్లికి వెళ్లనున్న భువనేశ్వరి రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో రేపు ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్రను భువనేశ్వరి ప్రారంభించనున్నారు.ముందుగా చంద్రగిరి సమీపంలోని అగరాల హైవే పక్కన బహిరంగ సభలో పాల్గొంటారు.
తరువాత బస్సు యాత్రను ప్రారంభిస్తారు.తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో దాదాపు మూడు రోజులపాటు సాగనున్న ఈ యాత్రలో చంద్రబాబు అరెస్టుతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు.







