తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నటి వితికా షేరు( Vithika Sheru ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదటి చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.
తెలుగుతో పాటు కన్నడ తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది వెతికా.తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక హీరో వరుణ్ సందేశ్( Varun Sandesh ) తో కలిపి కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్లడంతో ఇద్దరు పెద్దలను ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్నారు.

హీరో వరుణ్ సందేశం పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చాలా వరకు తగ్గించేసింది.తన భర్త వరుణ్ సందేశ్ తో కలిసి యూట్యూబ్ ఛానల్ లో సందడి చేయడంతో పాటు అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో కూడా పాల్గొంటూ ఉంటుంది.అలాగే కొన్ని యాడ్స్ లో కూడా ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే.సినిమాలలో నటించకపోయినప్పటికీ వితికా షేరు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తరచూ చూసిన మీడియాలో ఏదో ఒక ఫోటోలు పోస్టులు పంచుకునే వితికా తాజాగా తన చెల్లెలు కృతిక( Krithika ) గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్త ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఆ ఫోటోలలో ఇద్దరు అక్క చెల్లెలు ఎంతో క్యూట్ గా కనిపించారు.ఇద్దరూ ఓన్ సిస్టర్స్ కావడంతో దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి.ఇద్దరినీ ఒకేసారి చూస్తే ట్విన్స్ లా కనిపిస్తున్నారు.
తన చెల్లిలితో కలిసి దిగిన ఫోటోలతో పాటు చెల్లెలు కృత్తిక తన భర్తతో కలిసి పూజ చేస్తున్న ఫోటోలను సైతం షేర్ చేసింది వితికా షేరు.ఆ ఫోటోలను చూసిన అభిమానులు నెటిజన్స్ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
కాగా 2021లో చెల్లి కృతిక పెళ్లి దగ్గరుండి జరిపించింది వితిక.ఈ క్రమంలోనే తాజాగా భర్త కృష్ణతో కలిసి కొత్తింట్లో అడుగుపెట్టింది కృతిక.
అంతే కాకుండా వితిక ఇటీవల వంద మంది చిన్నారులకు స్వయంగా గుత్తి వంకాయ కూర బిర్యానీ వండి వడ్డించిన సంగతి తెలిసిందే.ఆ వీడియో కూడా నెటిజన్లు ఆకట్టుకుంది.







