తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఎవరికీ సాధ్యం కాని రీతిలో భారీ విజయాలను అందుకుంటున్న ఏకైక హీరో బాలయ్య బాబు( Balayya Babu ) అనే చెప్పాలి.సీనియర్ హీరోలందరికి పోటీని ఇస్తూ ఆయన వరుసగా నాలుగు విజయాలను సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ప్రస్తుతం ఆయన అఖండ 2 ( Akhand 2 )సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
వరుసగా ఐదో విజయాన్ని సాధించి ఎనలేని గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సీనియర్ హీరోలెవ్వరికి సాధ్యం కానీ రీతిలో ఆయన భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనప్పటికి తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ప్రతి హీరో పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో పొజిషన్ కోసం విపరీతమైన కష్టాలు పడుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలో బాలయ్య సీనియర్ హీరో అయినప్పటికి ఎక్కడ తగ్గకుండా యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఘనత మాత్రం బాలయ్య బాబుకే దక్కుతుంది.ఇక బాబి( Bobby ) డైరెక్షన్ లో చేసిన సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా బాలయ్య బాబుకు గొప్ప క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది.

అఖండ 2 సినిమాతో బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే దృఢ సంకల్పంతో అతని అభిమానులైతే ఉన్నారు.మరి ఈ సినిమా నుంచి వచ్చే టీజర్ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు.తొందర్లోనే సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఈ మూవీ ఎన్ని వందల కోట్లను రాబడుతోంది అనేది.








