మన దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.కానీ భారతదేశం( India ) వెలుపల ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం ఉంది.
అమెరికాలోని న్యూజెర్సీ( New Jersey in America ) రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో స్వామినారాయణ్ అక్షరధామ్ గా పిల్లవాబడే ఈ దేవాలయాన్ని మహంత్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు.అక్షరధామ్ దేవాలయం( Akshardham Temple ) నిర్మాణంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, తొమ్మిది శిఖరాలు, 9 పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి.
ఈ దేవాలయంలో సంప్రదాయ రాతి వాస్తు శిల్పం యొక్క అతిపెద్ద దీర్ఘ వృత్తాకార గోపురం ఉంది.

ఈ దేవాలయం( Temple ) 183 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉంది.అలాగే ఢిల్లీలో ఉన్న అక్షరాధామ్ దేవాలయం 100 ఎకరాల్లో ఉంది.పురాతన హిందూ గ్రంధాల ప్రకారం ఈ దేవాలయం నిర్మాణం జరిగింది.
ఈ దేవాలయ నిర్మాణనికి సుమారు 12 సంవత్సరాల సమయం పట్టింది.ఈ దేవాలయం నిర్మాణంలో సుమారు పదివేల విగ్రహాలను ఉపయోగించారు.
అలాగే కంబోడియాలోని 12వ శతాబ్దంలో నాటి అంగ్‌కోర్ హట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం( Hindu temple )గా చెబుతున్నారు.ఈ దేవాలయం 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.
ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉంది.దాని తర్వాత బహుశా ఇదే అతిపెద్ద హిందూ దేవాలయం అని చెబుతున్నారు.

ఈ ఆలయం అక్టోబర్ 8వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సమాచారం.అయితే విజిటర్స్ కు మాత్రం అక్టోబర్ 18 వ తేదీ నుంచి అలో చేస్తున్నట్లు చెబుతున్నారు.అక్షరధామ్ దేవాలయ నిర్మాణంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు,తొమ్మిది శిఖరాలు, 9 పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి.ఈ దేవాలయంలో సంప్రదాయ రాతి వాస్తు శిల్పం యొక్క అతిపెద్ద దీర్ఘ వృత్తాకార గొపురం ఉంది.
ఇది దాదాపు 1000 సంవత్సరాల ఉండేలా రూపొందించారు.అంతే కాకుండా సున్నపు రాయి, గ్రానైట్, గులాబీ ఇసుక రాయి, పాల రాయితో సహా దాదాపు రెండు బిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని దేవాలయ నిర్మాణానికి ఉపయోగించారు.