ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.15
సూర్యాస్తమయం:సాయంత్రం 05.34
రాహుకాలం: ఉ.08.35 నుంచి 09.30 వరకు
అమృత ఘడియలు: మ.03.36 నుంచి 04.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.10 నుంచి 11.52 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రాశి వారికి ఈ రోజు మొదట్లో కొంతమేర ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ చివర్లో లాభాలను పొందుతారు.మీ పిల్లల విజయంతో మీకు ఎంతో గర్వకారణం గా ఉంటుంది.ఈ రాశివారు ఈరోజు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
వృషభం:

వృషభ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో కొద్దిగా చిరాకుగా గడుపుతారు.ఏ రాశి వారికి ఈ రోజు కొంతమేర ఆర్థిక లాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.జీవిత భాగస్వామి నుంచి అనుకోని బహుమతులు తీసుకుంటారు.ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.
మిథునం:

అనుకోకుండా దూరప్రయాణాలు ఏర్పడటంవల్ల బాగా అలసి పోతారు.ఈ రాశివారికి అనుకోని అతిథి ఇంటికి వస్తారు.చిన్ననాటి మిత్రులను కలవడం వల్ల గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతారు.ఈ రాశి వారికి ఈ రోజు కొంతవరకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటకం:

కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ రీత్యా అధిక శ్రమ కలుగుతుంది.సకాలంలో పనులు పూర్తి చేయటం వల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకోవడం వల్ల మానసికంగా ఎంతో ప్రశాంతం గా ఉంటారు.
సింహం:

ఈ రాశి వారికి ఈరోజు అధిక పని ఒత్తిడి వల్ల సహోద్యోగులతో కొంతమేర విభేదాలు ఏర్పడవచ్చు.గత కొద్దిరోజుల నుంచి వాయిదా పడుతున్న ఇబ్బందులను ఈరోజు పూర్తి చేసుకుంటారు.అనుకోకుండా ఒక మిత్రులను కలవడం వల్ల ఈరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు.
కన్య:

ఈ రాశి వారు ఏదైనా వ్యాపారం లేదా కొత్త పనులను ప్రారంభించడానికి ఈ రోజు ఎంతో అనుకూలం.ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడం వల్ల విజయం పొందుతారు.ఈ రాశి వారికి ఈ రోజు కొంతమేర ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ రాశి వారికి గొడవలు తగాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు మనం వీలయినంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండటం ఎంతో మంచిది.
తులా:

ఈ రాశివారు ప్రతి చిన్న విషయానికి ఎంతో కంగారు పడిపోతుంటారు.అలా కంగారు తగ్గటం వల్ల మీ సమస్య మరింత పెద్దదవుతుంది.వృత్తిపరంగా కష్టపడుతున్న వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.ఈ రాశివారు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.
వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈ రోజు లాభాలను చవి చూస్తారు.ఈ రాశి వారు ఈ రోజు చేయాలనుకున్న పనులుమీ జీవిత భాగస్వామి ద్వారా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కొంత వరకు జాగ్రత్త వహించడం అవసరం.
ధనస్సు:

ఈరోజు ధనుస్సు రాశి వారికి కొంత మేర సానుకూల ప్రభావం కనిపిస్తున్నాయి.మీ బంధువులు, సోదరీ సోదరుల సహాయంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఈరోజు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే వారికి ధనలాభం కలుగుతుంది.ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.
మకరం:

వృత్తి రీత్యా ఎంతో ఒత్తిడి పెరగడం వల్ల సహోద్యోగులతో బేదాభిప్రాయాలు ఏర్పడతాయి.ఈ రాశి వారికి ఇతరులతో తగాదాలు,విభేదాలు ఏర్పడే పరిస్థితి లేకపోవడం వల్లనే వీలైనంతవరకు ప్రశాంతమైన వాతావరణంలో కి వెళ్లడం మంచిది.రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామి మీ కోసం సహాయ పడుతుంది.
కుంభం:

ఈ రాశివారికి అనారోగ్య సమస్యల కారణంగా కొంత మేర నిరాశ కలుగుతుంది.ఎప్పటి నుంచి రావాల్సిన పాత రుణాలు చేతికి అందుతాయి.అనుకోకుండా అతిథులు ఇంటికి రావడం వల్ల వారితో ఎంతో ఆనందంగా గడుపుతారు.
మీనం:

ఈ రాశి వారు సంతృప్తికరమైన జీవితం కోసం ఎంతో మానసికంగా దృఢంగా ఉండాలి.ఎన్నో రోజుల నుంచి వినిపిస్తున్న రుణాలను తీర్చి ఎంతో ప్రశాంతంగా గడుపుతారు.మీ దగ్గరనుంచి ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉన్న వారితో దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం.