చిన్నారులు తెలిసీ తెలియని వయసులో చేసే చిన్న చిన్న పనులు ఒక్కోసారి ప్రాణాలమీదకు వస్తుంటుంది.ఉత్తరప్రదేశ్ బరేలి భోలాపూర్ లో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.
ఏడాది పిల్లాడు ఇంటిదగ్గర ఆడుకుంటుంటే అటుగా ఓ పాము వచ్చింది.అయితే అది పాము అని గ్రహించేంత వయసు కూడా లేకపోవడం తో ఆ పాము వస్తున్న వైపు చిన్నారి చెయ్యి పెట్టడంతో ఆ పాము ఆ చిన్నారి చెయ్యి పైకి ఎక్కింది.
అయితే ప్రతీదీ నోట్లో పెట్టుకోవడం అలవాటైన ఆ చిన్నారి క్యాజువల్‌గా ఆ పామును కూడా నోట్లో పెట్టుకున్నాడు. రబ్బరును నమిలినట్లుగా పామును నమిలేశాడు.
అయితే అనుకోకుండా అదే సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా పిల్లాడి నోట్లో పాము తోక వేలాడుతూ కనిపించింది.దీంతో ఏంటది అని ఒక్కసారిగా బయటకు లాగితే పిల్లాడి నోట్లో నుంచి పాము బయటపడడం తో ఆ కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి చెందారు.
అసలు ఏమి జరిగిందో అర్ధంకాక అలా చూస్తూ ఉండిపోయారు.దీనితో పిల్లాడి నోట్లో కుటుంబ సభ్యులు నీళ్లు పోసి నానా హంగామా చేశారు, కానీ ఆ చిన్నారి మాత్రం కొద్దిసేపటికే స్పృహ కోల్పోవడం తో హుటాహుటిన ఆ పిల్లాడిని ఆసుపత్రికి తరలించారు.
ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ కంగారు పడొద్దంటూ… ఓ ర్యాక్ లోంచీ ఇంజెక్షన్ తీసి కసక్కున పొడిచాడు.అది చూసిన తల్లిదండ్రులు డాక్టర్ వైపు, చిన్నారి వైపు ఆందోళనగా చూశారు.
డాక్టర్ వాళ్ల దగ్గరకు వచ్చి ఏడుపు ముఖం పెట్టి వాళ్లవైపు చూశాడు.ఆ తల్లిదండ్రుల్లో ఒకటే ఆందోళన.
డాక్టర్ ఒక్కసారిగా నవ్వి… మరేం పర్లేదు పిల్లాడు సేఫ్ అని చెప్పడం తో ఆ చిన్నారి కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.