డెన్మార్క్‌లోని ఒక కేఫ్ “హస్బెండ్ డే కేర్ సెంటర్“( Husband day care center ) నడుపుతోంది.ఈ కేఫ్ కోపెన్‌హాగన్‌లోని గ్రీన్ టవర్స్‌లో ఉంది.“మీకు రెస్ట్ తీసుకోవడానికి టైమ్ కావాలా? షాపింగ్ చేయాలనుకుంటున్నారా? మీ భర్తను మాతో వదిలేయండి! మీ కోసం మేం అతన్ని చూసుకుంటాం! మీరు అతని డ్రింక్స్‌కి మనీ మాత్రం చెల్లించండి.” అంటూ ఒక సైన్‌బోర్డు ఈ సెంటర్ ముందు కనిపిస్తుంటుంది.ఈ ఆలోచన వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకుంది.అతను ట్విట్టర్( Twitter )లో ఈ కాన్సెప్ట్‌ను ప్రశంసించారు.

“ఇన్నోవేషన్ అంటే కొత్త ప్రొడక్ట్స్ క్రియేట్ చేయడమే కాదు ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్ కోసం కొత్త కేసులను సృష్టించడం కూడా.ఇది బ్రిలియంట్” అని భర్త డే కేర్ సెంటర్‌ను ఉద్దేశించి ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

అయితే ఈ డే కేర్ సెంటర్ గురించి కొందరు పాజిటివ్‌గా స్పందిస్తే, మరికొందరు దీని అవసరం లేదని కామెంట్ చేశారు.షాపింగ్ కోసం వెళ్లేటప్పుడు తమ భర్తను ఇంట్లోనే కూర్చో బెడతామని, వారిని చూసుకోవడానికి ప్రత్యేకంగా డే కేర్ సెంటర్ అవసరమే లేదని కొందరు మహిళలు కామెంట్ చేస్తారు.

ఇక ఇప్పటికే కొన్ని మాల్స్ మగవారి కోసం ఇలాంటి డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేశాయి.తమ ఆడవారు షాపింగ్ చేస్తుంటే మగవారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ డే కేర్ సెంటర్‌లో రెస్ట్ తీసుకోవచ్చు.టీవీ చూడవచ్చు.వారి భాగస్వాములు షాపింగ్ చేస్తున్నప్పుడు స్నాక్స్, డ్రింక్స్ పొందవచ్చు.మరోవైపు కొంతమంది ట్విట్టర్ యూజర్లు ఈ కాన్సెప్ట్ వినూత్నంగా ఉందని కామెంట్ చేశారు.ఇకపోతే పిల్లల కోసం డేకేర్ సెంటర్లు కొత్త కాన్సెప్ట్ కాదు.
అవి పని చేసే జంటలకు లైఫ్‌లైన్‌గా ఉన్నాయి.అయితే భర్త డే కేర్ సెంటర్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
కానీ ఇవి సక్సెస్ అవుతాయా అనేది ప్రశ్నార్థకమే.







