నాగార్జున( Nagarjuna ) సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా ఉంటున్నాడు.ఎలాంటి సినిమా తీస్తే హిట్ అవుతుంది ? సక్సెస్ ఫార్ములా ఎలా ఉంటుంది? జనాల్లోకి సినిమా వెళ్లాలంటే ఎలాంటి కథలను ఎంచుకోవాలి ? కథకు సరిపడా మసాలా ఎలా తయారు చేసుకోవాలి.? ఏ దర్శకుడితో సినిమా తీస్తే విజయం సాధిస్తారు ? కొత్తవారిని ఎంకరేజ్ చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? పాతవారి తో వెళితే ఎలాంటి సినిమాలు దక్కుతాయి అనే విషయం చాలా బాగా తెలుసు.మరి అలాంటి నాగార్జున సినిమా తీస్తున్నాడు అంటే జనాల్లో ఆసక్తి కూడా అలాగే ఉంటుంది.
రొట్ట కథలతో సినిమాలు తీస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో నాగార్జున కు తెలియనిది కాదు.కానీ ఎన్ని సార్లు ఫ్లాప్ వస్తున్న నాగార్జున మళ్ళీ అదే జోనర్ లో పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తూనే ఉన్నాడు.

నాగార్జున తో సినిమాలు తీసే నిర్మాతలు కూడా ఆయనతో అలాంటి రొట్ట కథలతోనే సినిమాలు తీస్తున్నారు.కానీ ప్రేక్షకుల అభిరుచి ఎప్పుడూ మారుతూనే ఉంటుంది.అందుకే రొటీన్ కథలతో వస్తున్న సినిమాలను చాలా ఈజీగా పక్కన పెట్టేస్తున్నారు.అయినా కూడా నాగార్జున లో ఎలాంటి మార్పు లేదు.చాలా ఏళ్లుగా మూస కథలతోనే సినిమాలు తీస్తున్నాడు.రెండు ఫైట్లు నాలుగు పాటలు ఉంటే చాలు అలాగే రెండు ఎలివేషన్స్ పెట్టుకొని, జుట్టు పెంచుకొని మాస్ డైలాగ్స్ తో సినిమా చూస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాడు.
కానీ కంటెంట్ ఉంటేనే చిత్రాలు నడుస్తాయి అనే విషయం మాత్రం మర్చిపోయాడు నాగార్జున.

ఈ ఫార్ములా జనాలు వందల సినిమాల్లో చూశారు కొత్తగా వస్తేనే కొత్తదనం చూపిస్తేనే సినిమాలు నడిచే రోజులు వచ్చాయి కానీ నాగార్జున ఆ విషయంలో అందరి హీరోల కన్నా వెనకే ఉన్నాడు నిన్నటికి నిన్న నా సామిరంగా( Naa saami ranga ) చిత్రం కూడా అదే కథనం అదే కథ.కానీ సినిమాల పార్ట్ టైం జాబ్ లాగా ఫీల్ అవుతున్నాడో ఏమో కానీ షోలతో ఏడాది మొత్తం బిజీగానే ఉంటున్నాడు.అందువల్లే సినిమాలు అలా ఏదో చేసేసి ఈ పక్కన పడేస్తూ జనాలకు తాను ఇంకా ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ ఆయనకు ఇంట్రెస్ట్ మాత్రం లేదని చెప్పాలి.







