నులి పురుగులను నాశనం చేసే నారింజ తొక్కలు.. ఇంతకీ ఎలా వాడాలంటే?

నులిపురుగులు.ప్రతి మనిషి సర్వ సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.

 Best Ways To Cure Stomach Worms!,stomach Worms, Parasitic Worms, Orange Peel, Gr-TeluguStop.com

ముఖ్యంగా చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య అనేది చాలా అధికంగా ఉంటుంది.పెద్దల్లో సైతం కొంతమంది ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు.

పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్నజీవులే నులిపురుగులు.కడుపులో నులిపురుగులు ఉంటే రక్తహీనత, ఆకలి లేకపోవడం, పోషకాల కొరత, తరచూ కడుపు నొప్పి రావడం, విరేచనాలు, బలహీనత, బరువు తగ్గడం.

తదితర సమస్యలన్నీ తలెత్తుతాయి.

Telugu Coconut, Tips, Latest, Orange Peel, Parasitic Worms, Stomach Worms-Telugu

దీంతో నులిపురుగుల సమస్యను నివారించుకోవడం కోసం మందులు వాడుతుంటారు.అయితే సహజంగా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు అద్భుతంగా తోడ్పడతాయి.

నారింజ తొక్కలు నులి పురుగులను నాశనం చేయడానికి గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.అందుకోసం ముందుగా నారింజ తొక్కలను శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి.

పూర్తిగా ఎండిన తర్వాత ఆ తొక్కలను మెత్తగా పొడి చేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడి కలిపి తీసుకోవాలి.

ఇలా మూడు రోజుల పాటు చేస్తే నులిపురుగులు దెబ్బకు నశిస్తాయి.

అలాగే నులిపురుగులను అంతం చేయడానికి కొబ్బరి చాలా బాగా సహాయపడుతుంది.

ఇది అతి ప్రాచీనమైన చికిత్స.కొబ్బరి అన్ని రకాల నులిపురుగులను నివారిస్తుంది.

రోజుకు రెండు టేబుల్ స్పూన్లు పచ్చికొబ్బరి తురుము తింటే నులిపురుగులు తొలగిపోతాయి.

Telugu Coconut, Tips, Latest, Orange Peel, Parasitic Worms, Stomach Worms-Telugu

ఇక వేప పువ్వు కూడా నులిపురుగుల సమస్యను దూరం చేస్తుంది.అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు ఎండిన వేప పువ్వు, వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున భోజనం చేసే సమయంలో మొదటి ముద్దకు కలుపుకుని తినాలి.

ఇలా చేస్తే నులిపురుగులు పడిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube