ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా నటించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే మనం టక్కున జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) అని చెబుతాం.ఎందుకంటే ఈ హీరో యాక్షన్, కామెడీ, ఎమోషనల్, రొమాంటిక్, యాంగ్రీ, అమాయకత్వం ఇలా ఎలాంటి ఎమోషన్ అయినా తన ముఖంపై ఈజీగా పలికించగలడు.
ఏ పాత్ర పోషించినా ఇతడు నటిస్తున్నట్లు అసలు అనిపించదు.ఆ పాత్ర మాత్రమే మనకు కనిపిస్తుంది.
సింగిల్ టేక్ లో ఎలాంటి డైలాగునైనా చెప్పగలడు.అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ హీరోకి గ్లోబల్ లెవెల్లో కూడా చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.
సెలబ్రిటీలు కూడా అతని నటనకు ఫిదా అయిపోయారు.

తారక్ మంచి నటుడే కాదు ఆయనకు మరిన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి.కొన్ని లక్షణాలు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకు తప్ప మరెవరికి లేవని చెప్పుకోవచ్చు.ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏవో తెలుసుకుందాం.
ఎన్టీఆర్ ఇప్పటిదాకా 29 సినిమాల్లో నటించాడు.అయితే ఆయన ఒక్క సినిమాలో కూడా సేమ్ గెటప్‌ను రిపీట్ చేయలేదు.29 సినిమాల్లోనూ ఆయన విభిన్నమైన అవతారాల్లో కనిపించే ఆశ్చర్యపరిచారు.కొన్ని సినిమాల్లో లావుగా, కొన్ని మూవీస్‌లో బక్కగా కొన్ని చిత్రాల్లో సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టాడు.
కొన్ని సినిమాల్లో మంత్రాలు చదివే అయ్యగారిగా కూడా కనిపించి ఆకట్టుకున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేశాడు.తిపాత్రాభినయంలో కూడా చించేసాడు.

సింగింగ్ టాలెంట్ కూడా ఎన్టీఆర్ సొంతం.తారక్ ఓలమ్మీ తిక్కరేగిందా, 123 నేనొక కంత్రి, చారి, రాకాసి రాకాసి, ఫాలో ఫాలో వంటి పాటలు అద్భుతంగా పాడి వావ్ అనిపించాడు.అచ్చం ప్రొఫెషనల్ సింగర్ లాగానే ఈ పాటలు పాడే తనలోని కొత్త ప్రతిభను చాటుకున్నాడు.ఎన్టీఆర్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లు సంపాదించి రికార్డు క్రియేట్ చేశాయి.ఎవరూ సినిమాలు కూడా వరుసగా ఈ రేంజ్ లో సంపాదించలేదు.తారక్ పౌరాణిక పాత్రలకు చక్కగా సూట్ అయ్యే, ఆ పాత్రలో అద్భుతంగా నటించగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక హీరో కూడా.
డ్యాన్సులు కూడా బాగా చేయగలడు, మాటలు కూడా బాగా మాట్లాడగలడు.సింగల్ టేక్ లో ఎలాంటి సన్నివేశంలోనైనా అద్భుతంగా నటించగలడు.ఈ లక్షణాలు టాలీవుడ్ లో ఈ ఒక్క హీరోకి తప్ప మిగతా వారేవరికీ లేవని చెప్పుకోవచ్చు.