ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal )జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam)కేసులో భాగంగా కేజ్రీవాల్ కు కస్టడీని పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది.
ఈ క్రమంలోనే ఆయన జ్యుడీషియల్ కస్టడీ( Judicial Custody)ని మరో 14 రోజుల పాటు పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరింది.కాగా లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న కేజ్రీవాల్ జూన్ 2న న్యాయస్థానం ఎదుట లొంగిపోవాల్సి ఉంది.ఈ క్రమంలోనే తాజాగా ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.