జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పవిత్ర( Pavitra ) ఒకరు.ఈమె లేడీ కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు ఇతర బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఇక పవిత్ర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారు.అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని వీడియోలను ఈమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అయితే తాజాగా పవిత్ర పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాము అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.

రోడ్డు ప్రమాదం( Road Accident ) లో తమ కారు పూర్తిగా డామేజ్ అయిందని,అయితే తాము మాత్రం ప్రాణాలతో బయటపడ్డామంటూ ఈమె ఈ వీడియోని షేర్ చేశారు.గత కొన్ని నెలల క్రితం ఈమె కొత్త కారు కొన్నాను అంటూ ఒక వీడియోని అభిమానులతో పంచుకున్నారు అయితే అదే కారులో ఈమె ఓటు వేయడం కోసం తన సొంత గ్రామానికి తన పిన్ని అలాగే పిన్ని పిల్లలతో కలిసి బయలుదేరారట.తన కారు నెల్లూరు( Nellore) వద్ద ప్రయాణిస్తుంటే ఆ సమయంలో ఎదురుగా మరో కారు వచ్చి ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో కారు మొత్తం పూర్తిగా పాడైపోయిందని తెలిపారు.

ఈ ప్రమాదంలో తాము బ్రతకమని భావించాము కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఆ ప్రమాద ఘటన ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది అంటూ ఈ సందర్భంగా పవిత్ర తమ కారుకు జరిగినటువంటి ప్రమాదం గురించి చెబుతూ షేర్ చేస్తున్నటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది.ఇలా ప్రమాదం నుంచి బయటపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పటికే సీరియల్ నటి నటుడు పవిత్ర జయరాం చందు మరణ వార్తతో బుల్లితెర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
అయితే తాజాగా ఈమె కూడా రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డామనే విషయం తెలియజేయడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.