ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన ఆచార వ్యవహారాలు నడుస్తుంటాయి.తమిళనాడు రాష్ట్రంలోని( Tamil Nadu ) మధురై జిల్లాలో ఉన్న తిరుమంగళం నగరంలో ఉన్న కురుపారై ముత్తయ్య ఆలయంలో( Karumparai Muthaya Temple ) ప్రతియేటా నిర్వహించే జాతర ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.
అదో నాన్ వెజ్ జాతర.( Non-Veg Festival ) ఎవరు ఎంత తింటే అంత అన్నట్లుగా కేవలం నాన్ వెజ్ వంటలతో ఫెస్టివల్ నిర్వహిస్తారు.
అంతే కాదండి ఆ జాతర కేవలం పురుషులకు మాత్రమే ఆడవాళ్ళకి నో ఎంట్రీ.ఇక ఈ జాతర సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్గా జరిగే ఈ జాతరకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈ జాతరను ‘కిడా విరుందు’ అని పిలుస్తారు.దీని అర్థం మాంసాహార జాతర అని.ఈ జాతరకు ఎంతోమంది పురుషులు పెద్ద ఎత్తున వస్తారు.ప్రతి ఏటా మాల్గలి మాసంలో ఈ ఉత్సవాలను అక్కడ ప్రాంత ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.ఇందులో భాగంగా చాలామంది వారి మొక్కులను చెల్లించుకోవడానికి ఒక మేకపోతును సంవత్సరం పాటు పెంచి ఆ తర్వాత ఉత్సవాల సమయంలో స్వామివారికి మొక్కుకున్న తర్వాత మేకపోతులతో నాన్ వెజ్ వండి విందుకు ఏర్పాటు చేస్తారు.
అయితే ఇక్కడ కేవలం పురుషులు మాత్రమే( Men Only ) పాల్గొంటారు.

ఆరోజు 100కు పైన మేకపోతుల్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ఆనవాయితీ ఇంకా కొనసాగుతుంది.ఆ సమయంలో ఎవరైనా సరే ఎవరు ఎంత తింటారో అంత వారికి వడ్డిస్తారు.ఇక ఈ జాతర విషయంలో మాత్రం మహిళలకు( Women ) కచ్చితంగా ఎంట్రీ లేదు.
ఒకవేళ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం మహిళలు ఓ నిబంధన పాటించాలి.నాన్ వెజ్ విందు పూర్తి అయిన తర్వాత పురుషులు విస్తరులు తీయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాక అవి పూర్తిగా ఎండిపోయే వరకు స్త్రీలు పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళకూడదు.
ఆ ఇస్తరులు పూర్తిగా ఎండిపోయిన తర్వాతనే మహిళలకు ఆలయ ప్రవేశం ఉంటుంది.