ఆ విషయంలో టాలీవుడ్ ఇంకా మారలేదు.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

వెండితెర చందమామగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కాజల్ ( Kajal ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.సినీ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించారు.

 Kajal Agarwal Sensational Comments On Tollywood Industry , Kajal Agarwal, Satyab-TeluguStop.com

ఇలా తన కెరియర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఇక పెళ్లయిన వెంటనే ఈమెకు ఒక బాబు కూడా జన్మించడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.

Telugu Bollywood, Gautam Kitchlu, Kajal Agarwal, Satyabhama, Tollywood-Movie

ఇలా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న కాజల్ త్వరలోనే సత్యభామ ( Satyabama ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె త్వరలోనే సత్యభామగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఈ సినిమా మే 31వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

Telugu Bollywood, Gautam Kitchlu, Kajal Agarwal, Satyabhama, Tollywood-Movie

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగిన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయనే విషయం గురించి మాట్లాడారు.పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరియర్ ముగిసినట్టే అనుకోవడం పొరపాటు అని తెలిపారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే ఈ విషయంలో టాలీవుడ్ ఇంకా మారాల్సిన అవసరం ఉందని తెలిపారు.టాలీవుడ్ హీరోయిన్లకు పెళ్లయితే మేకర్స్ వారికి అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారని అయితే త్వరలోనే ఇక్కడ కూడా ఈ మార్పు వస్తుందని తెలిపారు.

అందుకు నేనే చక్కని ఉదాహరణ అంటూ పెళ్లయిన తర్వాత హీరోయిన్లకు ఛాన్స్ ల గురించి కాజల్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube