ముడి బియ్యంతో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఫాలిష్ బియ్యం జోలికి అసలు వెళ్ళరు

మన దక్షిణ భారతదేశంలో ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వరి అన్నమును తింటూ ఉంటాం.అయితే చాలా మంది అన్నంలో పోషక విలువల గురించి ఆలోచించరు.

అన్నం తెల్లగా పొడిపొడిలాడుతూ ఉందా అనేది మాత్రమే ఆలోచిస్తారు.అయితే కంటికి ఇంపుగా ఉండే ఈ అన్నంలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి.

 Health Benefits Of Eating Dampudu Biyyammudi Biyyam-ముడి బియ్యంతో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఫాలిష్ బియ్యం జోలికి అసలు వెళ్ళరు-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే బియ్యాన్ని పాలిష్ చేసినప్పుడు బి కాంప్లెక్స్ విటమిన్స్ పోతాయి.అందువల్ల దంపుడు బియ్యంతో తయారుచేసిన అన్నాన్ని తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

ముడి బియ్యం చూడటానికి ఇంపుగా లేకపోయినా చాలా పోషక విలువలు ఉన్నాయి.

ముడి బియ్యంలో ఉన్న పీచు అజీర్ణం,మలబద్దకం,గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

ముడి బియ్యం ఊక నుండి లభ్యమయ్యే నూనె కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది.ముడి బియ్యం తినటం వలన రక్తపోటు తగ్గటమే కాకుండా రక్త నాళాల్లో కొవ్వు పేరుకోకుండా కాపాడుతుంది.

ముడి బియ్యంలో పీచు ఎక్కువగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి త్వరగా వేయదు.

అందువల్ల బరువు తగ్గాలని అనుకున్నవారికి ముడి బియ్యం మంచి ఆహారం.

ముడి బియ్యంలో ఉండే పీచు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.

దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది.

ముడి బియ్యంలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది.

ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి,క్యాల్షియాన్ని మన శరీరం గ్రహించటానికి మెగ్నీషియం సహాయపడుతుంది.

ముడిబియ్యంలోని మెగ్నీషియం ఉబ్బసంతో బాధపడేవారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది.

ముడిబియ్యంలోని సెలీజినయమూ ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు