మనం కలలో తరచూ కొన్ని జంతువులను చూస్తూ ఉంటాం.అవి కొన్ని అందమైనవి అయినప్పటికీ కూడా చాలా ప్రమాదకరమైనవి.
అయితే కొన్ని జంతువులను మనం కలలో చూడడం వల్ల కొన్ని ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని జంతువులు, కొన్ని పక్షులు కలలో కనపడడం కొన్ని సంకేతాలను సూచిస్తాయి.
అయితే కల పుస్తకం ప్రకారం ఏ ఏ జంతువుల వల్ల, ఏ ఏ పక్షుల వల్ల మనకు నష్టం, అలాగే లాభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే కలల పుస్తకం ప్రకారం నల్ల పిల్లిని కలలో చూస్తే అది మనకు ప్రమాదం ఎదురవుతున్నట్టు సూచిస్తుంది.
అలాగే కలలో నల్ల పిల్లిని చూడడం వల్ల డబ్బు నష్టం కలుగుతుందని సూచన.అంతేకాకుండా కలలో పిల్లులు పోట్లాడుకోవడం కనిపిస్తే శుభప్రదం కాదు.దీనికి అర్థం భవిష్యత్తులో ఎవరితోనైనా మీకు వివాదం ఉండవచ్చు.ఇక అలాగే కలలో రాబందును చూస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం.
ఎందుకంటే రాబందు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.అలాగే కలలో రాబందు ఎగురుతున్నట్లు కనిపిస్తే మాత్రం అది శుభవార్త కాదు.
ఇది ఆశుభ సంకేతంగా పరిగణించబడింది.
దీనికి అర్థం భవిష్యత్తులో మీరు చాలా పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నారు అని సూచిస్తుంది.
అలాగే కలలో పాము కనిపిస్తే అది మీకు చాలా మంచి సంకేతం.కానీ కలలో పాము వెంబడించడం లేదా కాటు వేయడం లాంటివి కనిపిస్తే అది మంచిది కాదు.అది మీకు అశుభ సంకేతం.అలా కాకుండా కలలో రెండు పాముల మధ్య పోరు కనిపిస్తే మీరు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కుల్లో పడతారని సంకేతం.ఇక కలలో కుక్కను చూసినట్లయితే లేదా ఆ కుక్క దగ్గరికి వస్తున్నట్లు కనిపిస్తే మీరు మీ పాత స్నేహితుడిని కలుసుకోబోతున్నారని అర్థం.అయితే కోపంతో ఉన్న కుక్కను చూడటం మాత్రం మంచిది కాదు.
ఇలా కలిస్తే మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయబోతున్నారని అర్థం.
DEVOTIONAL