ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణమాసంలో పూజలను ఎక్కువగా చేస్తూ ఉంటారు.ముఖ్యంగా లక్ష్మీదేవి మంగళ గౌరీలతో పాటు హరిహరులను ప్రత్యేకంగా పూజిస్తారు.
అంటే శ్రావణమాసంలో వివిధ ఆలయాలలో భారీ సంఖ్యలో భక్తులు పూజలు చేస్తున్నారు.శివయ్యకు( Shivaiah ) జలాభిషేకం చేసి పూజలను చేస్తారు.
ఈ సమయంలో శివ భక్తులు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ ఉంటారు.వారు జ్యోతిర్లింగాలను( Jyotirlingam ) దర్శించి అభిషేకం చేసి శివుడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు.
అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అందరికీ సాధ్యం కాదు.

సమయం, ఆర్థిక కారణాల వల్ల అన్ని జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించడం సాధ్యం కాదు.అలాంటివారు పశ్చిమ బెంగాల్లోని( West Bengal ) హౌరా లో ఒకే స్థలంలో ఒకే దేవాలయంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు.ఉత్తర హౌరాలోని బంగేశ్వర్ మహాదేవ్ దేవాలయ ప్రాంగణంలో( Bangeshwar Mahadev Mandir ) 12 జ్యోతిర్లింగాలు ఉన్న దేవాలయాన్ని నిర్మించారు.
ఈ దేవాలయం చాలా పురాతనమైనప్పటికీ 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ( Pranad Mukherjee ) ఈ ఆలయ సముదాయంలో 51 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే 51 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహంతో పాటు 12 జ్యోతిర్లింగాలను ఒకే దేవాలయ ప్రాంగణంలో చూడవచ్చు.శ్రావణమాసం( Shravanamasam ) ప్రారంభం అయినప్పటి నుంచి ఈ దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా సోమవారాలలో సుదువురా ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు.
శివునికి జల అభిషేకం చేస్తారు.అలాగే ప్రత్యేక పూజలు చేస్తారు.
భక్తులు మహా శివుని ప్రార్థిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి.
అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది.మన దేశంలో ఉన్న దేవాలయాలకు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వచ్చి స్వామి వారిని పూజిస్తూ ఉంటారు.
DEVOTIONAL