ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్క జీవికి మరణం తప్పకుండా సంభవిస్తుంది.మరణం అనేది మనుషుల కైనా, జంతువులకైనా, పక్షులకైనా, తప్పనిసరిగా సంభవిస్తుంది.
అయితే కొందరికి మరణం తొందరగా సంభవిస్తుందని మరి కొందరు ఎక్కువ రోజుల పాటు జీవిస్తారు.ఎన్ని రోజులు జీవించినప్పటికీ మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి.
ఈ క్రమంలోనే మరణం అనేది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధంగా సంభవిస్తుంది.కొందరు అనారోగ్యంతో చనిపోతే, మరికొందరు ప్రమాదాల బారిన పడి చనిపోతారు.
మరికొందరు ఎంతో బాధను అనుభవిస్తూ చనిపోతుంటారు.గరుడ పురాణం ప్రకారం మనిషి చేసిన తప్పుల వల్ల వారికి మరణం సంభవిస్తుందని ఇది తెలియజేస్తుంది.
అయితే మనిషి బతుకు ఉన్న సమయంలో ఎలాంటి తప్పు చేయడం వల్ల ఎలాంటి మరణం సంభవిస్తుంది అనే విషయాన్ని గరుడ పురాణం ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఎవరైతే వారి జీవిత కాలంలో ధర్మప్రకారం నడుచుకొని ఇతరుల పట్ల మానవత్వం కలిగి ఉంటారో అలాంటి వారు ఎలాంటి బాధ, నొప్పి, భయం లేకుండా హాయిగా ఎవరినీ నొప్పించకుండా మరణిస్తారు.
అదేవిధంగా ఎవరైతే వారి బతికున్న సమయంలో ఇతరుల సంపద కోసం ఆరాటపడుతూ ఇతరులను మోసం చేసి డబ్బును పోగు చేసుకుని జీవించి ఉంటారో అలాంటి వారికి చావు అంత సులభంగా రాదు.వీరు చనిపోయే ముందు ఎంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆ బాధను అనుభవించే మరణిస్తారు.

తోటి మనుషుల పట్ల జంతువుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ వారిని హింసించే వారికి దీర్ఘకాలిక వ్యాధులు సోకి, మంచానపడి బాధను బాగా అనుభవించిన చనిపోతారట కొన్నిసార్లు ప్రకృతి విపత్తు జరిగే పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుని ఎక్కువమంది చనిపోతుంటారు.పాపాలు చేసినవారు వారి కర్మ ఫలితం అనుభవించడానికి ఒకే చోట ఈ విధంగా ప్రకృతి విపత్తు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఇలాంటి ప్రమాదాలలో చాలా మంది చనిపోతున్నారని గరుడ పురాణం తెలియజేస్తుంది.