తిరుమల( Tirumala ) కొండకు భక్తుల రద్దీ రోజురోజుకీ పెరిగిపోతోంది.తిరుమల కొండకు చేరే భక్తుల అవసరాలకు తగ్గట్టు వసతి సౌకర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది.
వీవీఐపీ( VVIP ) ల నుంచి సామాన్య భక్తుల వరకు వసతి కల్పించేందుకు గెస్ట్ హౌస్ లు, కాలేజీలు, పిలిగ్రిమ్స్ ఎమినిటీస్ సెంటర్స్ ను అందుబాటులో తెచ్చింది.తిరుమల లో మొత్తం 7500 అన్ని రకాల గదులు అందుబాటులో ఉండగా అందులో దాదాపు 300కు పైగా టీటీడీతో పాటు ఇతర శాఖల అవసరాల కోసం వినియోగంలో ఉన్నాయి.

దీనివల్ల 7200 వరకు గదులు మాత్రమే భక్తులు వసతి పొందేందుకు అవకాశం ఉండగా నాలుగు పీఏసీ సెంటర్లలో భక్తులు వసతి పొందేందుకు అవకాశం ఉంది.40,000 నుంచి 45 వేలమంది భక్తులు రోజు తిరుమల లో వసతికి అవకాశం ఉండగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య రోజు 80,000 వరకు ఉంటుంది.అంటే దాదాపు సగం మంది భక్తులకు తిరుమలలో వసతి కష్టం అవుతుంది.భక్తులు రోజు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను టిటిడి ( TTD )పరిష్కారం చూసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్త ఆలోచన తెర మీదకి తెచ్చింది.

తిరుమలలో పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటుంది.తిరుమలలో కొత్త నిర్మాణాలకు అనుమతులు లేవన్న నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉంది.దీనివల్ల తిరుమలలో ఎలాంటి కొత్త నిర్మాణాలకు అవకాశం లేకపోగా పాత విశ్రాంతి గృహాలను( Rest houses ) పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తుంది.
దీంతో భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రాగలుగుతున్న టీటీడీ భక్తులకు కొరతగా ఉన్న వసతి సమస్యలను మాత్రం పూర్తి స్థాయిలో పరి పరిష్కరించలేకపోతోంది.ఈ నేపథంలో కొత్త నిర్మాణాలు చేపట్టలేక కొత్త ఆలోచనకు తెరతీసింది.
రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో తాత్కాలికంగా బాస కల్పించేందుకు విశాఖపట్నం కు చెందిన మూర్తి అనేదాత విరాళంగా అందజేస్తున్న రెండు మొబైల్ కంటైనర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తో కలిసి మొబైల్ కంటైనర్లను ప్రారంభించగా జీఎన్సీ వద్ద టీటీడీ ట్రాన్స్ పోర్ట్ డిపోలో డ్రైవర్లు విశ్రాంతి తీసుకున్నందుకు ఈ రెండు కంటైనర్లను టిటిడి అందుబాటులో ఉంచింది.
DEVOTIONAL







