ఆర్ధిక పరమైన విషయాలకు పాన్ కార్డు కలిగి ఉండటం అనేది తప్పనిసరిగా మారిపోయింది.ఆర్ధిక లావాదేవీల జరపడానికి పాన్ కార్డు అనేది అవసరం.బ్యాంకులో రూ.50 వేలుపైన విత్ డ్రా చేయాలన్నా లేదా రూ.లక్ష పైన డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డు కలిగి ఉండాలి.ఇక ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరిన తర్వాత శాలరీ పొందాలన్నా పాన్ కార్డు అనేది తప్పనిసరిగా అడుగుతారు.
ఇక ట్యాక్స్ రిటర్న్స్ కోసం దాఖలు చేయాలన్నా పాన్ కార్డు ఉండాలి.ఇలా అనేక అవసరాలకు పాన్ కార్డు మనకు ఎంతో ఉపయోగపడుతుంది.

అయితే ఆధార్ కార్డుతో పాన్ కార్డు( PAN card )ను లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో సూచిస్తుంది.ఇప్పటికే పలుమార్లు ఈ గుడువును పొడిగించింది.ఇటీవల జూన్ 30తో గడువు ముగియగా.జులై 1 నుంచి ఆధార్( Aadhaar ) తో అనుసంధానం చేసుకోనివారి పాన్ కార్డులు ఇనాక్టివ్‌గా మారిపోయాయి.
దీంతో అలాంటివారు ఆర్ధిక లావాదేవీలు జరపాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పాన్ కార్డు ఇనాక్టివ్‌గా మారడం వల్ల స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడి పెట్టడానికి వీలు పడటం లేదు.
అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో జాప్యం జరుగుతోంది.

ఒకవేళ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ పొందటంలో కూడా ఆలస్యం జరుగుతుంది.అయితే పాన్ కార్డు పనిచేయకపోయినా కొన్ని లావాదేవీలు జరుపుకోవచ్చు.టీడీఎస్ ట్రాన్సాక్షన్ల( TDS transactions ) సమయంలో పాన్ కార్డు పనిచేయకపోయినా అమౌంట్లో 20 శాతం ట్యాక్స్ కట్ అవుతుంది.
అలాగే టీసీఎస్ కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.ఇక ఈపీఎఫ్ అకౌంట్ నుంచి రూ.50 వేలకుపైగా పాన్ కార్డు లేకపోయినా విత్ డ్రా చేసుకోవచ్చు.అలాగే రూ.10 లక్షలకుపైగా విలువైన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు.ఇక రూ.15 వేల కన్నా ఎక్కువైన బ్రోకరేజ్ పేమెంట్స్ చేసుకోవచ్చు.







