ఆస్ట్రేలియా కొత్త ఔషధం.. 48 గంటల్లోనే కరోనాకు చెక్..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శర వేగంగా విస్తరిస్తోంది.ఇప్పటికే పలు దేశాలు కరోనాను అరికట్టడానికి వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నాయి.

 Australia New Medicine For Corona , Russia, Corona Vaccine, Australia,48 Hours-TeluguStop.com

రష్యా కూడా వ్యాక్సిన్ ను అధికారికంగా రేపు రిలీజ్ చేయనుంది.కానీ, రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కరోనాపై ఎంత శాతం ప్రభావం చూపుతుందో తెలియని పరిస్థితి అని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి.కాగా రష్యా మొదట్లో దేశంలోని 1600 మందికి వ్యాక్సిన్ అందించిన తర్వాత వేరే దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ముందుగానే వెల్లడించింది.

ఈ తరుణంలో ఆస్ట్రేలియాకు చెందిన సెంటర్ ఫర్ డైజెస్టివ్ డిసీజ్ ఓ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆస్ట్రేలియా సూచిస్తున్న మెడిసిన్ పేరు ‘ఐవర్ మెక్టిన్’.

ఈ మెడిసిన్ ను తీసుకున్న 24 గంటల్లోనే కరోనాను పూర్తిగా చంపేస్తుందని సెంటర్ ఫర్ డైజెస్టివ్ డిసీజ్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ థామస్ బోరోడి వెల్లడించాడు.అయితే ఈ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా తీసుకోవాలి.

ఈ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు ‘డాక్సి సైక్లిన్, జింక్’ ట్యాబ్లెట్లను కలిపి వేసుకోవాలని సూచించారు.ఈ ట్యాబ్లెట్ వేసుకున్న 24 గంటల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందని, 48 గంటల్లో వైరస్ నాశనం అవుతుందన్నారు.ఐవర్ మెక్టిన్ టాబ్లెట్ ధర రూ.149 వరకు ఉంటుంది.ఇప్పటికే ఈ ట్యాబ్లెట్ ను బంగ్లాదేశ్, చైనా దేశాలు వాడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube