టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు.అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ఎంపీ కేశినేని నాని( MP Keshineni Nani ) తెలిపారు.
ఈ క్రమంలోనే చర్చ కోసం సీఎం జగన్ దాకా ఎందుకు.తానే సిద్ధమని తెలిపారు.

రాష్ట్రంలో ఎటు చూసినా జగన్( CM ys jagan ) చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కదా అని నిలదీశారు.అమరావతి( Amaravati )లో సచివాలయం కడితేనే అభివృద్ధి అంటారా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కట్టిన గ్రాఫిక్స్ అమరావతిపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.







