తెలుగు సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని, సాంప్రదాయాలను అద్భుతంగా ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకులలో అందరికన్నా ముందుంటారు కళాతపస్వీ కే విశ్వనాథ్.( Kalatapaswi K Viswanath ) ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి కేవలం 51 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు.
కానీ సినిమా ప్రపంచానికి కొత్త అందాలను పరిచయం చేశాడు కూడా.ఇక ఆయన తీసిన ఒక్కో సినిమా ఒక అద్భుతం.
సంగీతాన్ని, నృత్యాన్ని ఆధారం చేసుకుని సినిమాలు తీసి సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అవగాహన కల్పించిన దర్శకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.ఆయన జయంతి సందర్భంగా ఆయన తీసిన 51 అద్భుతమైన కళాత్మక చిత్రాలలో టాప్ 10 సినిమాలు ఏంటి? వాటి ప్రాధాన్యత ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
శంకరాభరణం

సంగీతాన్ని ఆధారంగా చేసుకుని 1980లో ఈ చిత్రాన్ని దర్శకుడు ఒకే విశ్వనాథ్ రూపొందించగా ఈ సినిమా తర్వాత ఎంతో మంది సంగీతాన్ని నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించారంటే అది మామూలు విషయం కాదు.
సిరివెన్నెల

ఈ సినిమా సైతం సంగీత నేపథ్యంలోనే తెరకెక్కగా శాస్త్రీయ సంగీతానికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది.ఈ సినిమాలో రాసిన పాటలకు గాను సీతారామశాస్త్రికి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా( Sirivennela Seetharama Sastry ) పేరు నిలిచిపోయింది.
సాగర సంగమం

ఈ సినిమా నృత్యాన్ని ప్రధానంగా చేసుకొని రూపొందించబడింది.కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా వచ్చిన ఈ చిత్రం 1983లో విడుదల అయింది.ఈ సినిమా తర్వాత చాలామంది ఒత్సాహికులు శాస్త్రీయ నిత్యాన్ని నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించారు.
స్వాతిముత్యం

సమాజాన్ని మేల్కొలిపేలా చేసిన స్వాతిముత్యం సినిమా ఒక అమాయకుడి పాత్రతో ప్రయోగాత్మక తీసిన చిత్రం.భర్త చనిపోయిన యువతికి అమాయకుడైన హీరో మరో జీవితాన్ని ప్రసాదించడం దాని సమాజం ఒప్పుకోకవడం వంటి సబ్జెక్టుతో వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
శృతిలయలు

1987లో విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శృతిలయలు సినిమా( Sruthilayalu ) కూడా సంగీతం నేపథ్యంగానే దొరికేక్కింది.ఈ చిత్రంలో సుమలత, రాజశేఖర్ వంటి వారు ముఖ్యపాత్రలో నటించారు.
సిరిసిరిమువ్వ

సిరిసిరిమువ్వ( Siri Siri Muvva ) చిత్రం సైతం సంగీతం నృత్యం ప్రధానంగా తెరకెక్కింది.ఈ సినిమాలో జయప్రద హీరోయిన్ గా నటించగా, సవతి తల్లి చేతిలో కష్టాలు పడి ఇంటి నుంచి పారిపోయి పట్టణానికి చేరుకొని అక్కడ ఒక ప్రముఖ నృత్యకారునిగా ఎలా పేరు తెచ్చుకుంది ఆ తర్వాత ఎలాంటి టర్న్ తీసుకుంది అనే విషయాలతో ఈ చిత్రం తెరకెక్కి మంచి ప్రజాదరణ పొందింది
స్వయంకృషి

స్వయంకృషి( Swayamkrushi ) ఉంటే ఏ స్థాయికి చేరుకోవచ్చు అనే విషయాన్ని నిరూపించిన చిత్రం ఇది.చిరంజీవి హీరోగా వచ్చిన ఈ చిత్రం చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి ఎలాంటి ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగారు అని తెలియజేస్తుంది.ఈ సినిమా కూడా ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది
స్వర్ణకమలం

డ్యాన్స్ అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి పాశాత్య ధోరణికి ఇష్టపడి శాస్త్రీయ సంగీతాన్ని నిర్లక్ష్యం చేయడం వంటి అమాశాలతో తెరకెక్కిన స్వర్ణ కమలం భానుప్రియ మరియు వెంకటేష్ కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోయింది.
స్వాతి కిరణం

సంగీత ప్రధానంగా తెరకెక్కిన స్వాతికిరణం నుంచి సినిమా ఒక శిష్యుడి మరణానికి గురువు ఎలా కారణమయ్యాడనే విధా విషయంపై ఈ సినిమా ఎంతోమందికి మధురమైన అనుభూతులను మిగిల్చింది.
ఆపద్బాంధవుడు

చిరంజీవితో మరోమారు ప్రేమ, త్యాగం, సెంటిమెంట్ వంటి అస్త్రాలను సంధిస్తూ తీసిన ఈ చిత్రం ప్రేక్షకులతో పెద్దగా కమర్షియల్ విజయాన్ని అందుకోలేదు కానీ సినిమా మాత్రం ఒక చక్కని ప్రయత్నం గా మిగిలింది.ఈ సినిమాలోని పాటలు అన్నీ కూడా ఎంతో హిట్ కాగా ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కినది
.






